సారా నియంత్రణకు డ్వాక్రా సంఘాల వినతి
ABN , First Publish Date - 2021-07-15T06:01:08+05:30 IST
నాటు సారా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ గొలుగొండ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ రాజారావుకు కొయ్యూరు మండలం బకులూరుకు చెందిన డ్వాక్రా మహిళలు బుధవారం వినతి పత్రం అందజేశారు.

గొలుగొండ, జూలై 14 : నాటు సారా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ గొలుగొండ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ రాజారావుకు కొయ్యూరు మండలం బకులూరుకు చెందిన డ్వాక్రా మహిళలు బుధవారం వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో జోరుగా సారా తయారవుతోందని, దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతుండడంతో పాటు తాగినవారు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 29 డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.