Share News

ఏడుగురికి కారుణ్య నియామకాలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:10 AM

ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఏడుగురికి వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తూ శనివారం కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ తమ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు.

ఏడుగురికి కారుణ్య నియామకాలు
ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో కలెక్టర్‌, ఆర్టీసీ ఆర్‌ఎం, తదితరులు

ద్వారకాబస్‌స్టేషన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఏడుగురికి వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తూ శనివారం కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ తమ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఆర్టీసీ విశాఖ రీజియన్‌లోని వివిధ డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులుగా పనిచేస్తూ పలువురు మృతి చెందారు. తమకు కారుణ్య నిమామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మృతుల వారసులు సంబంధిత అధికారులకు, కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ దరఖాస్తులను పరిశీలించాక ఏడుగురిని అర్హులుగా గుర్తించి వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన వారికి కూడా త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామమని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీఆర్వో బీహెచ్‌ భవానీశంకర్‌, ఆర్టీసీ విశాఖ రీజియన్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ జె.తిరుపతి, అసిస్టెంట్‌ మేనేజర్‌ జి.శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:10 AM