పరిశ్రమల్లో భద్రతకు పెద్దపీట వేయాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:08 AM
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేయాలని, తరచూ మాక్‌డ్రిల్స్ నిర్వహించి కార్మికులు, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, పరిశ్రమల నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పించాలని స్పష్టం చేశారు.

కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేయాలని, తరచూ మాక్‌డ్రిల్స్ నిర్వహించి కార్మికులు, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, పరిశ్రమల నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన జిల్లా క్రైసెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా కంపెనీల్లో పనిచేసే సిబ్బందికి, కార్మికులకు తప్పనిసరిగా బీమా సదుపాయం కల్పించాలన్నారు. ప్రాణ నష్టం లేకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని, అన్నిచోట్లా ఆటోమెటిక్ అలారం సిస్టమ్స్ ఉండాలని పరిశ్రమల నిర్వాహకులకు ఆదేశించారు. కార్మికులకు అన్ని రకాల వసతులను కల్పించాలని, పర్యావరణ హిత విధానాలకు ప్రాధాన్యతనివ్వాలని, సూచించారు. అన్నిచోట్లా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్మికులు, ప్రజల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో ఫ్యాక్టరీల చీఫ్ ఇన్‌స్పెక్టర్ సురేశ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, డీఎఫ్‌వో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.