డ్రెస్సెల్ ప్రపంచ రికార్డు
ABN , First Publish Date - 2021-08-01T09:29:01+05:30 IST
అమెరికా స్టార్ స్విమ్మర్ కాలెబ్ డ్రెస్సెల్ టోక్యోలో సంచలనాల మోత మోగిస్తున్నాడు. పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో డ్రెస్సెల్ 49.45 సెకన్లతో...

అమెరికా స్టార్ స్విమ్మర్ కాలెబ్ డ్రెస్సెల్ టోక్యోలో సంచలనాల మోత మోగిస్తున్నాడు. పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో డ్రెస్సెల్ 49.45 సెకన్లతో ప్రపంచ రికార్డు టైమింగ్ నమోదుచేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో గతంలో తనపేరిటే ఉన్న 49.50 సెకన్ల ప్రపంచ రికార్డును తిరగరాశాడు. టోక్యోలో డ్రెస్సెల్కిది మూడో స్వర్ణం కావడం విశేషం. క్రిస్టోఫ్ (హంగేరీ)కు రజతం, నో పాంటి (స్విట్జర్లాండ్)కు కాంస్యం దక్కాయి.