కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతం
ABN , First Publish Date - 2022-10-14T05:45:48+05:30 IST
కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం భక్తులు సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు.
స్వర్ణ రథంపై విహరించిన వరసిద్ధుడు
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 13: కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం భక్తులు సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అలంకార మండపంలోని కల్యాణ వేదిక వద్ద సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లఉ ఉంచి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం దంపతుల ఆధ్వర్యంలో సంకట హరగణపతి వ్రతాన్ని ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా నిర్వహింపజేశారు. స్వర్ణ రథంపై మాడవీధులలో వినాయకస్వామిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, రవి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్, బాబు, భక్తులు పాల్గొన్నారు.