ABN effect: రాజమండ్రిలో జనసేన ఆందోళన.. ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-12-22T15:14:29+05:30 IST
సర్కారు వారి కబ్జా’ ప్రైవేట్ స్థలాల్లో అంటూ అధికారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై ఏబీఎన్ ప్రసారం (ABN effect) చేసిన కథనాలపై జనసేన (Janasena) స్పందించింది.
రాజమండ్రి: ‘సర్కారు వారి కబ్జా’ ప్రైవేట్ స్థలాల్లో అంటూ అధికారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై ఏబీఎన్ ప్రసారం (ABN effect) చేసిన కథనాలపై జనసేన (Janasena) స్పందించింది. అధికారుల తీరుకు నిరసనగా రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయాన్ని (Rajahmundry Corporation Office) జనసేన ముట్టడించింది. పన్నుల పేరుతో ప్రభుత్వం ప్రైవేటు స్థలాలు కబ్జాకు యత్నిస్తుందని జనసేన ఆందోళన చేపట్టింది. కార్పొరేషన్ గేటు ఎదుట జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, జనసైనికులు బైఠాయించారు. గేట్లు వేసి జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.