పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2022-12-21T00:42:02+05:30 IST

పోలవరం నిర్వాసితుల ఇంటి స్థలాల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు.

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
పోలవరం నిర్వాసితుల కాలనీ పరిశీలిస్తున్న అడ్మినిస్ర్టేటర్‌ ప్రవీణ్‌ ఆదిత్య

గోకవరం, డిసెంబరు20: పోలవరం నిర్వాసితుల ఇంటి స్థలాల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు. గోకవ రంలోని గంగాలమ్మతల్లి గుడి సమీపంలో పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఇంటి స్థలాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నిర్వాసితుల ఇంటి స్థలాల సమస్య కోర్టులో ఉందని తెలిపారు. దానిని పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఏఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సంబంధించి పలు విష యాలను ఆయన కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకు న్నారు. నిర్వాసితులు తాము సొంతంగా నిర్మించుకుంటున్న గృహా లకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.2.80 లక్షలు తమ బ్యాంక్‌ ఖాతాలో త్వరలో జమవుతాయన్నారు.కాలనీలో విద్యుత్‌, నీరు అందు బాటులో లేవని నిర్వాసితులు ప్రవీణ్‌ ఆదిత్య దృష్టికి తీసుకెళ్లారు.సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2022-12-21T00:42:04+05:30 IST