అక్టోబరుకు.. అయ్యేనా..?
ABN , First Publish Date - 2022-08-27T05:43:31+05:30 IST
ప్రభుత్వ సేవలు ప్రజల దరికి చేర్చేలా సచివాలయాలను, ఆర్బీకేలను రెండేళ్ల క్రితం గ్రామాల వారీగా పట్టణాలు, నగరాల్లో అయితే వార్డుల వారీ గా ఏర్పాటు చేశారు.

అసంపూర్తిగా ప్రభుత్వ భవన నిర్మాణాలు
నత్తనడకన సచివాలయాలు, ఆర్బీకేల పనులు
నిధులు లేక.. బిల్లులు రాక అసంపూర్తిగా భవనాలు
ఉమ్మడి జిల్లాలో సగం కూడా పూర్తికాని ప్రభుత్వ భవనాలు
స్థలాల సమస్య.. వివాదాలతో కొన్ని చోట్ల ప్రారంభమే కాలేదు
నిర్మాణాల పూర్తిపై సీఎం ప్రకటనతో తలలు పట్టుకుంటున్న అధికారులు
అక్టోబరు చివరి కల్లా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) నిర్మాణాలు పూర్తి కావాలి. అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలి.. గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేసే మూలస్తంభాలైన సచివాలయాలు, ఆర్బీకేలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.. అని సీఎం జగన్ మంగళవారం జరిగిన సమీక్షలో తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో అక్టోబరు కు ఆయా నిర్మాణాలు పూర్తి అవుతాయా అంటే కష్టమేనని తెలుస్తోంది. నిధులు లేక.. బిల్లులు రాక ఎన్నో భవనాల పనులు మధ్యలో నిలిచిపోగా పలు చోట్ల స్థలాల సమస్య వెంటాడుతుంది. మరికొన్ని దగ్గర్ల వైసీపీ నాయకులు పంతాలకు పోయి కోర్టుల్లో కేసులు వేయడంతో అసలు వాటి పనులే మొదలు కాలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. సచివాలయ, ఆర్బీకేల వ్యవస్థను ప్రారంభించి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఆయా కార్యాలయా ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్టోబరుకు వాటిని ఏవిధంగా అందుబాటులోకి తేవాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
ప్రభుత్వ సేవలు ప్రజల దరికి చేర్చేలా సచివాలయాలను, ఆర్బీకేలను రెండేళ్ల క్రితం గ్రామాల వారీగా పట్టణాలు, నగరాల్లో అయితే వార్డుల వారీ గా ఏర్పాటు చేశారు. హడావుడిగా అప్పట్లో వీటిని ఏర్పాటు చేయగా.. పలు సచివాలయాలు, ఆర్బీకేల అద్దె భవనాల్లో లేదంటే ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే పాఠశాలల్లో ఏర్పాటు చేయగా ఇటీ వల కోర్టు ఆదేశాలతో వాటిని మార్చారు. ఈ క్రమంలో ప్రతి సచి వాలయం, ఆర్బీకేలకు సొంత భవ నాలు ఉండాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించి మంజూ రు చేసింది. అయితే సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల భవన నిర్మాణాలు మొక్కుబడిగా జరు గు తున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా ల్లోని పరిస్థితులు చూస్తే సీఎం జగన్ ప్రకటించినట్లు ఈ ఏడాది అక్టోబరుకు కాదు కదా వచ్చే ఏడాదికి కూడా పూర్తి చేయడం కష్టమేనని అధి కారు లు అభిప్రాయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన తొలి నాళ్లలో స్థల సేకరణ హడావుడిగా చేశారు. భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జోడించి నిర్మాణాలను చేపట్టారు. అయితే ఆయా నిర్మాణాలకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోవడంతో పలు చోట్ల పను లు అసంపూర్తిగా ఉన్నాయి. స్థానిక నా యకులు అధికారుల ద్వారా కాంట్రా క్టర్లపై ఒత్తిడి తెస్తున్నా వారు ముందుకురావడం లేదు. కొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్ల పేరుతో తొ లుత స్థానిక నేతలే భవన నిర్మా ణాలకు ఉత్సాహం చూపినా బిల్లు ల్లో తేడాలతో ప్రస్తుతం వెనుకంజ వేస్తున్నారు. అందుబాటులో ఉన్న నిధులతో కొన్ని చోట్ల మాత్రం నిర్మా ణాలను పూర్తి చేశారు. అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయని పలు గ్రామా లవాసులు ఆరోపిస్తున్నారు.
హడావుడి.. నిధుల లేమి
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 206 గ్రామ సచివాలయాలు, 155 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. అందు కోసం రూ.113.04 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తొలినాళ్లలో నిర్మాణ పనులపై హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులు కేటాయింపు వాయి దా వేస్తూ వచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణా లను ఆపేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 98 గ్రామ సచివాలయా లు, 41 రైతు భరోసా కేంద్రాలు మాత్రమే పూర్తయినట్లు అధికా రులు చెబుతున్నారు. మిగిలిన 108 సచివాలయాలు, 114 రైతు భరోసా కేంద్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న 108 సచివా లయాల్లో 45 తుది దశకు చేరుకున్నాయి. పదిహే ను శ్లాబ్ స్థాయిలో, 24 పైకప్పు దశలో ఆగి పోయాయి. 20 పునాదుల దశలోనే ఉన్నాయి. 2 సచివాలయాలకు పునాదులు కూడా పడలేదు. ఇంకో రెండు సచివాలయాలు అసలు ప్రారం భానికే నోచుకోలేదు. నిర్మాణ దశలో ఉన్న 114 ఆర్బీకేల్లో 15 తుది దశకు చేరుకోగా, 29 పైకప్పు దశలో, 52 పునాదుల దశ లో, 11 పునాదులు కూడా పడని దశలో ఆగిపోయాయి. మరో 7 భవనాలు నిర్మాణానికి కూడా నోచుకోలేదు. నిర్మాణాలను యుద్ధ ప్రాతి పదికన నిర్మించాలని ఆదేశాలు జారీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన నిధులు కేటాయించడంలేదు.
శంకుస్థాపనతో సరి
కర్లపాలెం మండలం ఎం.వి.రాజుపాలెం గ్రామంలో 2020లో సచివాలయ నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన గుంతను కూడా పూడ్చేశారు. శిలాఫలకం మాత్రం వెక్కిరిస్తున్నది. ఈతేరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం బేస్‌మెంట్ నిర్మించి వదిలేశారు. పిట్టలవానిపాలెం మండలం అల్లూరులో సచివాలయ భవన సముదాయం అసంపూర్తిగా వదిలేశారు.
- నరసరావుపేట నియో జకవర్గంలో 44 గ్రామ సచివాలయా లకు 34 భవనాలు, 32 ఆర్బీకేలకు 19 భవనాల నిర్మాణం పూర్తి చేశారు. సచివాలయాలు, ఆర్బీ కేల భవనాల నిర్మాణాలను పూర్తి చేయడంలో రాష్ట్రంలోనే నరసరావుపేట మండలం రెండో స్థానంలో ఉంది. ఈ మండలంలో 25 సచి వాలయాల నిర్మాణం చేపట్టగా 21 భవ నాలు పూర్తి కాగా మూడు భవనాల పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఇదే మండలంలో 23 రైతు భరోసా కేం ద్రాలకు 16 భవనాల నిర్మాణం పూర్తి యింది. రొంపిచర్ల మండలంలో 19 గ్రామ సచివాలయాలకు 10 భవనాల నిర్మా ణం పూర్తయింది. ఈ మండలంలో 9 రైతు భరోసా కేంద్రాలకు మూడు భవనాలు పూర్తి కాగా రెండింటి నిర్మాణాలు ముగింపు దశలో ఉన్నాయి.
- బాపట్ల మండలంలో 21 సచివాలయాలు, కర్లపాలెం మండలంలో -15, పిట్టలవానిపాలెం మండంలో -12 చొప్పున మంజూరు కాగా కర్లపాలెంలో-3, పిట్టలవానిపాలెంలో-7 నిర్మిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాలు బాపట్ల మండలంలో 9, కర్లపాలెంలో 6 మంజూరు కాగా ఒక్కొక్కటి చొప్పున పూర్తి చేశారు. కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో మూడు మంజూరైనప్పటికి ఒకదానికి కూడా స్థలం చూపించలేకపోయారు.
- మంగళగిరి వ్యవసాయ శాఖ సబ్‌డివిజన్ పరిధిలో 60 రైతు భరోసా కేంద్రాలు ఉండగా, వాటిలో 50 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా యి. కేవలం పది కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు న్నాయి. ఉపాధి హామీ పథకం నిధుల తో ఆర్బీకేలు, సచివాలయాల నిర్మాణం చేస్తుండ డంతో అర్బన్ ప్రాంతాలకు ఈ నిధులను విని యోగించడం సాధ్యపడకపోవడంతో మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో సొంత భవనాల నిర్మాణం సాధ్యపడలేదని అధికారులు చెబుతు న్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ లో 65 సచివాలయాలకు 50 వరకు సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 15 అద్దె భవ నాల్లో కొనసాగుతున్నాయి.
- తుళ్లూరు మండలం పెదపరిమిలో రెండు, వడ్డమాను, హరిశ్చం ద్రాపురంలో ఒక్కోటి చెప్పున ఆర్బీకేల నిర్మాణానికి స్థలాలు ఉన్నా నిధులు లేక పనులు జరగడంలేదు. లింగాయపాలెం, మందడం, రాయపూడిల్లో ఆర్బీకేలకు సీఆర్డీఏ స్థలం కేటాయించలేదు. తుళ్లూరు మండలంలో ఏడు ఆర్బీకేలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు అద్దె భవనల్లో ఉన్నాయి.
- పొన్నూరు మండలం చింతలపూడి, వడ్డిముక్కల, ఆలూరు, ఇటికంపాడు, కట్టెంపూడి, కసుకర్రు గ్రామాలను జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తప్పించా రు. దీంతో ఈ గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో నేటికీ పాత పంచాయతీ కార్యాలయాల్లోనే సచివాలయాలను నిర్వహిస్తున్నారు. చేబ్రోలులో నాగేంద్రస్వామి ఆలయానికి చెందిన కమ్యూనిటీ హాలు లో గ్రామ సచివాలయాన్ని రెండేళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారు.
- వినుకొండ పట్టణంలో 32 వార్డులకు 12 వార్డు సచివాలయా లు గతంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు స్థలాల కొరత తీవ్రంగా వేధి స్తుంది. వినుకొండ మండలంలో 15 సచివాలయాలకు 4 బేస్మెంట్, 2 సెకండ్ శ్లాబ్, 2 తుదిమెరుగుల దశలో ఉన్నాయి. ఆరు సచివాలయాలు మాత్రమే పూర్తయియ్యాయి. విఠంరాజుపల్లిలో స్థల వివాదం కోర్టులో ఉండ టంతో పనులు నిలి చిపోయాయి. శావల్యాపురం మండలంలో ఏడు పూర్తికాగా 4 నిర్మాణంలో ఉన్నా యి. బొల్లాపల్లి మండలంలో 17 సచివాలయాలకు 14 పూర్తికాగా 1 తుదిమెరుగులు, 2 శ్లాబ్ లెవల్‌లో ఉన్నాయి. నూజెండ్ల మండలంలో 15 సచివాలయాలకు మూడు బేస్మెంట్, 1 రూప్‌లెవల్, 2 శ్లాబ్, 4 తుదిమెరుగుల దశలో ఉండగా ఏడు భవనాలు పూర్తయ్యాయి. ఈ పూరులో 12 సచివాలయాలకు 11 పూర్తయ్యాయి. చిట్టాపురం సచివాలయం పునాదులకే పరిమితమైంది.
- నాదెండ్ల మండలంలో 14 పంచాయతీలకు 4 సచివాలయాల నిర్మాణం పూర్తికాగా ఏడు భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నా యి. కనపర్రులో శ్లాబు పూర్తికాగా మరొక శ్లాబ్ నిర్మాణం నిలిచి పో యింది. యడ్లపాడు మండలంలో 12 సచివాలయాలకు 9 భ వనాల నిర్మాణం పూర్తి చేశారు. గురజాల మండలంలోని దైదా,
-పులిపాడు, గంగవరం, చర్ల గుడిపాడులో 2, మాడుగుల 2, అంబాపురం 1 చొప్పున రైతు భరోసా కేంద్రాలు మం జూరు కాగా నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభిం చలేదు. పిడుగురాళ్ల మండలం వీరాపురం, కోనంకి, పెదఅగ్రహారం, జానపాడు, గుత్తి కొండ, మాచవరం మండలంలో హెచ్‌పీతండా, ఎస్‌పీ తండా, ఎన్‌పీతండా, హెచ్ ఆర్‌పురం, దాచేపల్లి మండలం మాదినపాడు, భట్రుపాలెం గ్రామాల్లో ఆర్బీకే పనులు ప్రారం భం కాలేదు. జానపాడు లో ఆర్బీకే నిర్మాణానికి స్థలాన్ని చూడలేదు. జానపాడులో సచివాలయ భవన పనులు ఆపేసి ఆరేడు నెలలు అవుతుంది.
- సత్తెనపల్లి మండలంలో 19 గ్రామ సచివా లయాలకు భవనాలు మంజూరుకాగా రెండు భవనాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు 19 మంజూరు కాగా రెండు మాత్రమే ప్రారంభమయ్యాయి. రాజుపాలెం మండలంలో 14 సచివాలయ భవనాలకు నాలుగు మాత్రమే పూర్తయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు 10 మం జూరుకాగా రెండు మాత్రమే పూర్తయ్యాయి. నకరికల్లు మండలానికి 14 సచివాలయాలు మం జూరు కాగా పది పూర్తయ్యాయి. ముప్పాళ్ల మం డలానికి 13 సచివాలయాలు మంజూరు కాగా ఆరు గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు పది మంజూరు కాగా నాలుగు పూర్తయ్యాయి.