అనధికార లేఅవుట్‌లతో ప్రజలు మోసపోవద్దు

ABN , First Publish Date - 2022-10-16T05:08:59+05:30 IST

వాల్మీకి పురం మండలంలోని చింతపర్తి గ్రామ పంచాయతీలో అనధికార లేఅవుట్లతో ప్రజలు మోస పోవద్దని పంచాయతీ కార్యదర్శి పాండురం గయ్య పేర్కొన్నారు.

అనధికార లేఅవుట్‌లతో ప్రజలు మోసపోవద్దు
అనధికార లేఅవుట్‌లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న పంచాయతీ సిబ్బంది

వాల్మీకిపురం, అక్టోబరు 15: వాల్మీకి పురం మండలంలోని చింతపర్తి గ్రామ పంచాయతీలో అనధికార లేఅవుట్లతో ప్రజలు మోస పోవద్దని పంచాయతీ కార్యదర్శి పాండురం గయ్య పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో ని సర్వే నెంబరు 128-3సి, 128, 106లలో అనధికార హౌసింగ్‌ లేఅవుట్‌లు వేశారని సంబంధించి వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఆ లేఅవుట్‌లకు ఎలాంటి పంచాయ తీ అప్రూవల్‌, అనుమతులు లేకపోవడంతో సంబంధిత లేఅవుట్‌లలో పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశా రు. ఆ అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోరాదని హెచ్చరిక బోర్డు లో పేర్కొన్నారు. లేఅవుట్‌లు వేసిన వ్యక్తులు గ్రామ పంచాయతీ అప్రూవల్‌, అనుమ తులు పొందిన తరువాత కానీ ఎలాంటి విక్రయాలు జరపరాదని, అతిక్రమిస్తే చట్టపర మైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. 


Updated Date - 2022-10-16T05:08:59+05:30 IST