అంతా కడప వారే..
ABN , First Publish Date - 2022-12-15T00:16:43+05:30 IST
సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుక నలుగురు ఉన్నారని, సీఎస్, డీజీపీ, తాడేపల్లి కొంపలో సలహాదారు అందరూ కడప వారేనని, ఆయన బంధువులేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

సీఎస్, డీజీపీ, సలహాదారు ఇలా..
రెడ్డిగూడెం / జి.కొండూరు / గొల్లపూడి, డిసెంబరు 14: సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుక నలుగురు ఉన్నారని, సీఎస్, డీజీపీ, తాడేపల్లి కొంపలో సలహాదారు అందరూ కడప వారేనని, ఆయన బంధువులేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జి.కొండూరు మండలం కవులూరు, రెడ్డిగూడెం మండలం కుదప, రుద్రవరంలో, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుదప ఆర్డీకే వద్ద నిరసన తెలిపారు. మద్దతు ధరతో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి చేస్తే అవుట్ అని మంత్రులకు సీఎం జగన్ సీరియన్ వార్నింగ్ ఇవ్వడాన్ని బట్టే అర్థం చేసు కోవచ్చు రాష్ట్రంలో ఏస్థాయిలో అవినీతి పెచ్చుమీరిం దోనన్నారు. మంత్రులు ఇప్పటి వరకు దోచుకున్నది చాలు ఇక ఆపండం ప్రజల్లోకి వెళ్లండి ఇప్పటికే లక్ష కోట్లు దోచే శారు ఇంకా దోచేస్తే ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తదితక మీడియా సంస్థలు మిమ్మల్ని బట్టలూడదీయించి నిలబేట్టేం దుకని హెచ్చరించారన్నారు. ఎమ్మెల్యే వసంత అతని బావమరిది, అనుచరులు వాటాలు వేసుకొని దోచుకుంటు న్నారన్నారు. మార్కెట్ యార్డ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నా రన్నారు. నర్రా వాసు, ముప్పిడి నాగేశ్వర రెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్ రెడ్డి, రాయుడు వెంకటేశ్వ రరావు, పాడిబండ్ల సత్యంబాబు, తదితరులు పాల్గొన్నారు.