ఎన్టీఆర్ పేరే కొనసాగించాలి
ABN , First Publish Date - 2022-09-30T06:10:51+05:30 IST
ఎన్టీఆర్ పేరే కొనసాగించాలి

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ రిలే దీక్షలు
గన్నవరం, సెప్టెంబరు 29: దేశ చరిత్రలో ఎవ రూ యూనివర్సిటీల పేర్లు మార్చలేదని, తుగ్లక్‌గా పే రొందిన సీఎం జగన్ పాలనలో తొలిసారిగా జర గు తోందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ విమర్శించారు. హెల్త్ యూనివర్సి టీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని శాంతి థియేటర్ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు గురు వారం చేపట్టిన నిరసన దీక్షను ఆయన ప్రారంభించారు. తెలుగు వైభవానికి ప్రతీకైన ఎన్టీఆర్‌ను సీఎం అవమా నించారని, చరిత్రహీనుడిగా జగన్ మిగిలిపోతారని ఎమ్మెల్సీ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చుల అర్జు నుడు విమర్శించారు. దొంతు చిన్న, జాస్తి వెంకటేశ్వ రరావు, బోడపాటి రవికుమార్, జూపల్లి సురేష్, కంచర్ల ఈశ్వరరావు, మండవ లక్ష్మి, మేడేపల్లి రమాదేవి, దేవి నేని సులోచన, చిరుమామిళ్ల సూర్యం పాల్గొన్నారు.
పేరు మార్చి ఏం సాధించారు?
ఉంగుటూరు: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చిన ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ప్రశ్నించారు. జగన్ తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాన్ని ఆయన చెల్లి షర్మిల కూడా వ్యతిరేకించారని ఆయన అన్నారు. టీడీపీ మండల నాయకులు నాలుగు రోడ్ల జంక్షన్లో నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ, టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి బచ్చుల అర్జునుడుతో కలిసి కొనకళ్ల దీక్షాశిబిరాన్ని సందర్శించి, దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టించి, పరిపాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పేర్లమార్పిడికి తెరదీశారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్, కొండేటి వెంకటేశ్వరరావు, నిమ్మకూరి మహేష్, నిమ్మకూరి స్వరూపరాణి, గుడ్డేటి శ్యామ్, కొలుసు రవీంద్ర, తమ్మారెడ్డి సుధాకర్, సారంపాటి సాయి, గుత్తా వెంకటేశ్వరరావు, బెజవాడ నాగేశ్వరరావు, దేవినేని హర్ష, మం డవ రమ్య, చల్లగుల్ల బెనర్జీ, లక్ష్మణరావు పాల్గొన్నారు.
వికృతానందం పొందుతున్నారు
పెనమలూరు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వికృతానందం పొందుతున్న సీఎం జగన్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, వైసీపీ దుర్మార్గ పాలనతో భ్రష్టు పట్టిన రాష్ర్టాన్ని బాగు చేసుకోవాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా రావాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ తాడిగడప కమిటీ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమని టీడీపీ తా డిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం మహా పాపమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన పార్టీ పరిశీలకుడు జువ్వా రామకృష్ణ దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కుర్రా నరేంద్ర, దొంతగాని పుల్లేశ్వరరావు, కోయ ఆనంద్‌ప్రసాద్, సూదిమళ్ల రవీంద్రప్రసాద్, హాజీ షేక్ ఇమాం, కొసరాజు మ ల్లేశ్వరరావు, సయ్యద్ ఇబ్రహీం, మేడసాని రత్నకుమారి, యార్లగడ్డ సుచిత్ర, విజయలక్ష్మి, కల్యాణి పాల్గొన్నారు.
