అంబేద్కర్‌కు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-12-06T23:18:18+05:30 IST
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ వర్దంతి సందర్భంగా మంగళవారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, మండలంలోని చెల్లాయపాళెం, రేబా ల, మినగల్లు, పెనుబల్లి తదితర గ్రామాల్లో ఆయనకు నివాళులర్పించారు.

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు 6 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ వర్దంతి సందర్భంగా మంగళవారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, మండలంలోని చెల్లాయపాళెం, రేబా ల, మినగల్లు, పెనుబల్లి తదితర గ్రామాల్లో ఆయనకు నివాళులర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు దళితసంఘం, మాలమహానాడు నేతలు, అధికారులు ముం దుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుచ్చి నగర చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అంబేడ్కర్ ఆశయసాధన కమిటీ, దళిత సంఽఘాల నాయకులు, కార్యకర్తలు స్థానిక జొన్నవాడ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. మహిళల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తిగా అంబేడ్కర్‌ను చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ కొనియాడారు. గోవర్దన్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంనాయుడు, డాక్టర్ అల్లాభక్షు, మురళి, మల్లారెడ్డి, దళిత నేతలు బీవీ. రమణయ్య, ఎస్‌వీ.రమణయ్య, రేబాల సర్పంచు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
టీడీపీ నేత దినేష్‌రెడ్డి నివాళి
జొన్నవాడ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ కోవూరు నియోజకవర్గం ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి స్థానిక నాయకులతో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంవీ. శేషయ్య, హరికృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, హరనాథ్, రామానాయుడు, శీనయ్య, కొండయ్య, ప్రసాద్,తాళ్ల నరసింహస్వామి, సుల్తాన్, నజీర్, జాకీర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోవూరు : స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నాదుల రవికుమార్, ఇంటూరి విజయ్, ఇందుపూరు మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మండల కమిటీ అధ్యక్షడు ఇంతా మల్లారెడ్డి నాయకులు బాలరవి, ముసలి సుధాకర్ నివాళుల ర్పిం చారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతిలో డీఏఏబీ జిల్లా చైర్మన్ నిరంజనబాబురెడ్డి, పడుగుపాడు సొసైటీ ఛైర్మన్ మల్లికా ర్జునరెడ్డి, వైఎస్ ఎంపీపీ శివుని నరసింహులురెడ్డి, ఎంపీటీసీ వేణు పాల్గొన్నారు.
ముత్తుకూరు : స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యాయుడు చెంచురామయ్య ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మామిడిపూడి దళిత వాడలో సీపీఎం నాయకులు నక్కా రాధయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయ కులు నాగరాజు, శ్యాంప్రసాద్, శ్రీనివాసులు, సలాం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వెంకటాచలం : స్థానిక తహసీల్థార్ కార్యాలయంలో తహసీల్దారు వై.నాగరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లా డుతూ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడానికి అందరూ ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహ సీల్దారు విజయకుమార్, ఆర్‌ఐ శివకుమార్ తదితరులున్నారు.
పొదలకూరు : పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ గుంటి శ్రీనివాసులు, వార్డు సభ్యులు జి.భాస్కర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చలపతి, గంగవరపు వేణు పాల్గొన్నారు.
రాపూరు : మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలతో పాటు పలుచోట్ల అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సంకురాత్రిపల్లిలో టీడీపీ నేత నువ్వుల శివరామకృష్ణ, ఎంపీపీ పాండ్ర చంద్రయ్య, తూమాయి రోడ్డులో ఎమ్మార్పీఎస్ రంగయ్య, అంకయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలా భిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
సైదాపురం : స్థానిక టీడీపీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సర్కిల్ వద్ద అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి ఎస్సీ. ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ డా.శేషు, అన్నం శ్రీనివాసులు, తమ్మా రవి, కనుపూరు మస్తాన్, పొట్టేళ్ల ప్రభాకర్, పెంచలయ్య పాల్గొన్నారు.