రాక్షస పాలనను అంతం చేయాలి
ABN , First Publish Date - 2022-12-03T23:31:57+05:30 IST
జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, వైసీపీ పాలనను అంతమొందించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇ న్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరశింహారెడ్డి అన్నా రు.
ప్రజల ముందుకు వైసీపీ వైఫల్యాలు
కనిగిరి, డిసెంబరు 3 : జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, వైసీపీ పాలనను అంతమొందించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇ న్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరశింహారెడ్డి అన్నా రు. కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతుని పాడు మండలం వేములపాడు గ్రామంలో శని వారం రాత్రి డాక్టర్ ఉగ్ర ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటినీ సందర్శించి వైసీపీ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయా లు, నిత్యావసరాల ధరలను వివరించారు. టీ డీపీ అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలను నియంత్రిస్తామని తెలిపారు. ఒక్కచాన్స్ అం టూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని, రాష్ట్రాన్ని నిం డా ముంచేశారని విమర్శించారు. జగనన్న ఇళ్ల పేరుతో ఎమ్మెల్యేల జేబులు నిండాయని ఉగ్ర ఆరోపించారు. పథకాలు ప్రతి ఇంటికీ అంది స్తున్నామని ప్రచారం చేసుకుంటూ ప్రతి ఇంటినీ దోపిడీ చేస్తున్నారన్నారు. వచ్చే ఎ న్నికల్లో జగన్‌రెడ్డి ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీ డీపీ నాయకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, చీక టి వెంకటసుబ్బయ్య, మురహరి నరసయ్య, తి రుపతిరెడ్డి, శివకుమారి, రెడ్డెం తి రుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పామూరులో..
పామూరు : జగన్‌రెడ్డి సాగిస్తున్న రాక్షస పాలలను ప్రజలు అంత మొందించేందుకు ఎ న్నికల్లో వైసీపీని ఓడించా లని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు జ డ్పీటీసీ మాజీ సబ్యుడు బొల్లా మా ల్యాద్రిచౌదరి కోరారు. పామూరు మే జర్ పంచాయతీ పరిధిలోని డీవీ పాలెంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రనికి అనే కార్యక్రమం శనివారం నిర్వహిం చారు. సంక్షేమ పథకాలు ముసుగు లో ప్రజలపై ధరల భారాలుమోపి జగన్‌రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇచ్చిన పథకాలన్నింటిలోనూ ఏటేటా భారీగా కోత పెట్టి అర్హులకు అన్యాయం చేస్తున్నా ర న్నారు. టీడీపీ అభిమానులైన అనేక మంది పే దలకు పథకాలు కట్ చేశారన్నారు. ప్రజలను, కార్మికులను, ఉద్యోగులను ముప్పుతిప్పలు పె డుతున్న జగన్‌రెడ్డికి గట్టి బుద్ధి చెప్పాలని ఆ యన పి లుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను అతికించి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేప ట్టారు. కార్యక్రమంలో ఏ ప్రభాకర్ షేక్ ఖా జా రహం తుల్లా సయ్యద్ అమీర్‌బాబు, ఆర్ ఆర్ రఫి, హరిబాబు, పాలపర్తి వెంకటేశ్వర్లు కావి టి సుబ్బయ్య, ప్రసాద్‌రెడ్డి గౌస్‌బాషా, మాల కొండయ్య, కోటిరెడ్డి, హజరత్ పాల్గొన్నారు.
అరాచక పాలకులను సాగనంపాలి
సీఎస్‌పురం : అరాచక పాలన సాగిస్తోన్న వైసీపీని ప్రజలు సాగనంపాలని టీడీపీ మం డల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య అ న్నారు. మండలంలోని కంభంపాడు, కోమటి గుంట్ల, చింతపూడి, నాగులవరం గ్రామాలలో టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ రాష్ర్టానికి’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామాలలోని ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివ రించడంతోపాటు ప్రజల సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. కంభంపాడు గ్రామంలో అ ధ్వానంగా ఉన్న పారిశుధ్యంపై నిరసన తెలి పారు. జగన్‌రెడ్డి రాష్ట్రాని దిక్కులేనిదిగా మార్చారన్నారు. వీరి వేధింపులకు భయపడి పె ట్టుబడిదారులు పక్క రాష్ట్రాలకు వెళ్తు న్నార న్నారు. ప్రశ్నించేవారిపై దాడులు, అక్రమ కేసు లతో భయపడెతున్నారన్నారు. భూ ఆక్రమణ లు, ఇసుక, మద్యం అమ్మకాలతో దోచుకుంటు న్నారన్నారు. మూడున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని తరిమివేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో మాజీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, మాజీ సర్పంచ్‌లు ఎన్‌సీ మాలకొండయ్య, పు నుగుపాటి రవికుమార్, పార్టీ సీనియర్ నా యకులు అట్లూరి రామకృష్ణంరాజు, కనిగిరి ని యోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జగన్నాథం లక్ష్మీదేవి, చింతపూడు గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పసుపులేటి గురుకృష్ణ, నరసింహ రాజు, బి.వెంకటాద్రి, బోయిన మాలకొండయ్య, కోనంగి వెంకటకొండయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.