శ్రుతిమించుతున్న వైసీపీ అరాచకాలు

ABN , First Publish Date - 2022-11-14T01:05:46+05:30 IST

ఒంగో లు నగరంలో వైసీపీ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆరోపించారు. చేతనైతే ఎమ్మెల్యే బాలినేని, ఆయన కుమారుడు ప్రజలకు సేవ చేయాలే తప్ప కక్ష్ సాధింపు చర్య లు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

శ్రుతిమించుతున్న వైసీపీ అరాచకాలు

ఒంగోలులో టీడీపీ కార్యకర్త టీ దుకాణం తొలగింపు

మండిపడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల

ఒంగోలు(కార్పొరేషన్‌), నవంబరు 13 : ఒంగో లు నగరంలో వైసీపీ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆరోపించారు. చేతనైతే ఎమ్మెల్యే బాలినేని, ఆయన కుమారుడు ప్రజలకు సేవ చేయాలే తప్ప కక్ష్ సాధింపు చర్య లు మానుకోవాలని ఆయన హితవు పలికారు. స్థానిక 50వ డివిజన్‌లోని వెంకటేశ్వరకాలనీ జం క్షన్‌ వద్ద టీడీపీ సానుభూతిపరుడు రాంబాబు టీ దుకాణం కూల్చివేతపై దామచర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి బా ధితులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తె లుసుకున్నారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగులపై అధికార పార్టీ అహంకారం చూపడం సరికాదన్నారు. గత 20 సంవత్సరాలుగా టీ దుకాణం నడుపుకుంటున్న రాంబాబు, చిరంజీవిలను వైసీపీలో చేరాలని ఒత్తి డి చేశారని, అందుకు రాంబాబు కుటుంబం ఒప్పు కోకపోవడంతో కార్పొరేషన్‌ అధికారులకు ఆదేశా లు జారీ చేసి టీ దుకాణం తొలగించడం దాష్టీక మేనని మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివా సరెడ్డి, ఆయన కుమారుడు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారన్నారు. వారిపై ఇప్పటికే ప్రజల్లో తీ వ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పారు. మంత్రి పదవి పోయినా పద్ధతి మాత్రం మార్చుకోని నేత లు ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. ఇదే ప రిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. నగరంలో రోడ్లు, కాలువలు ఆక్ర మించిన వందల దుకాణాలు తొలగించకుండా ఉ ద్దేశ్యపూర్వకంగా రాంబాబు దుకాణాన్ని తొలగించ డం కక్ష్యసాధింపు చర్య అని విమర్శించారు. చేత నైతే తనతో పోరాడాలే తప్ప టీడీపీ సానుభూ తిపరులను ఇబ్బందులకు గురిచేయడం మంచిప ద్ధతి కాదన్నారు. గడిచిన రెండేళ్ళలో అనుమతులు లేని కట్టడాలు, రోడ్డు ఆక్రమించి నిర్మించిన దుకా ణాలు ఎన్ని ఉన్నాయో తన వద్ద చిట్టా ఉందన్నా రు. వాటిజోలికి ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నిం చారు. రాజకీయపార్టీలకు నేడు అధికారం ఉం టుంది, రేపు పోతుందని, కార్పొరేషన్‌ అధికారులు కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అధికారులు పారదర్శకంగా పాలన అందించాలే తప్ప అధికార పార్టీ ఆదేశాలతో పేదల కడుపు కొ ట్టడం సరికాదన్నారు. వైసీపీ దాష్టీకాలు మాను కోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని దామ చర్ల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-14T01:05:48+05:30 IST