హెచ్‌ఎం డిప్యుటేషన్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-11-24T23:28:36+05:30 IST
కిల్లోయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ శ్రీకాకుళం వైటీసీ కి వెళ్లిన వైకే శ్రీకాంత్ డిప్యుటేషన్ రద్దు చేయాలని డీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినితపత్రాన్ని ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావుకు గురువారం అందజేశారు.
మందస: కిల్లోయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ శ్రీకాకుళం వైటీసీ కి వెళ్లిన వైకే శ్రీకాంత్ డిప్యుటేషన్ రద్దు చేయాలని డీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినితపత్రాన్ని ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కౌన్సిలర్ వై.తులసీదాస్ మాట్లా డుతూ.. ఆశ్రమ పాశఠాలలో రెగ్యులర్ హెచ్‌ఎం లేకపోవడంతో గిరిజన విద్యా ర్థుల విద్య కుంటుపడుతోందన్నారు. కిల్లోయి స్కూల్ కాంప్లెక్స్ కావడంతో ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం, ప్రభుత్వ నూతన విద్యావిధానాల అమలులో ఆలస్య మవుతోందన్నారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సవర గణేష్, సవర సోములు తదితరులు పాల్గొన్నారు.