కేజీబీవీలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-12-09T23:41:25+05:30 IST
కొత్తపాలెం కేజీబీవీలో గురువారం రాత్రి ఆరుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

కవిటి: కొత్తపాలెం కేజీబీవీలో గురువారం రాత్రి ఆరుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది, గ్రామస్థుల సాయంతో కవిటి సామాజిక ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించి, సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర హించి గొంతు ఇన్‌ఫెక్షన్ కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడినట్టు గుర్తించా రు. పిల్లల ఆరోగ్యం బాగానే ఉందంటూ డిశ్చార్జి చేశారు. విషయం తెలుసుకున్న పలువురి పిల్లల తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకుని 47 మందిని వెంట తీసుకువెళ్లిపోయారు. పాఠశాలలో మొత్తం 257 మంది పిల్లలు ఉన్నారు. సీజనల్ దగ్గు ప్రమాదకరమేమి కాదని వైద్యులు చెప్పారని ఎస్‌వో రోజాదేవి తెలిపారు. ఈ విషయంపై ఆమెను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా అప్పటి వరకు బాగానే ఉన్నారని, రాత్రి దగ్గు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.