Union Minister Nirmala Sitharaman : అభివృద్ధికి నమూనాగా పీఎంలంక
ABN , First Publish Date - 2022-10-28T06:40:18+05:30 IST
‘సముద్ర కోత నివారణకు నరసాపురం మండలం పీఎంలంక వద్ద కట్టబోయే పిట్టగోడ మామూలిది కాదు. దేశంలోనే ఇది మూడోది. ఆధునిక
అందరూ ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధి చేస్తా
సముద్రపు కోత నుంచి రక్షణకు గోడ నిర్మాణం
దత్తత గ్రామంలో శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
నరసాపురం, అక్టోబరు 27: ‘సముద్ర కోత నివారణకు నరసాపురం మండలం పీఎంలంక వద్ద కట్టబోయే పిట్టగోడ మామూలిది కాదు. దేశంలోనే ఇది మూడోది. ఆధునిక టెక్నాలజీతో ఇటువంటి గోడలను ఇప్పటి వరకు రెండు చోట్ల మాత్రమే కట్టారు’.. అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో తన దత్తత గ్రామమైన పీఎంలంకలో గురువారం సముద్ర కోతను నివారిస్తూ చేపట్టే గోడ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ‘చెన్నై ఐఐటీ, డిలైట్ సాంకేతిక సహకారంతో ఈ గోడ నిర్మిస్తున్నాం. రూ.15 కోట్లతో 1000 మీటర్ల మేర ఈ గోడను నిర్మిస్తారు. ఇది చిన్న పిట్ట గోడలా కనిపించినా.. ఎటువంటి విపత్తులు వచ్చినా రక్షణగా ఉంటుంది. భవిష్యత్‌లో ఈ గ్రామాన్ని పెద్ద శిక్షణ కేంద్రంగా మారుస్తాను.
దేశంలో మొట్ట మొదటిసారిగా డీఆర్‌డీఏ పరిజ్ఞానాన్ని వినియోగించి బయో మరుగుదొడ్లను ఈ గ్రామంలోనే నిర్మించాం. దీన్ని చాలామంది కాపీ కొట్టి వారి నియోజకవర్గాల్లో నిర్మించారు. రానున్న రోజుల్లో ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధిని మిగిలినవారు అనుసరించాలి. అభివృద్ధి విషయంలో అంతా కలిసికట్టుగా ఉండాలి’ అని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పీఎంలంక ఈ గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో రూ.3.50 కోట్లతో నిర్మించిన స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. డ్వాక్రా, మత్స్యకార మహిళలతో కేంద్ర మంత్రి ముచ్చటించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కలెక్టర్ ప్రశాంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
నిధులిచ్చినా నీరివ్వలేరా?: కేంద్ర మంత్రి ఆగ్రహం
వీరవాసరం: ‘నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఉన్న సమయంలో మత్స్యపురితోపాటు మరో ఐదు గ్రామాలకు మంచినీటి పఽఽథకానికి నిధులు కేటాయించాను. నేటి వరకూ ఈ పథకాల పనులు పూర్తి కాలేదు. ఆ ఆరు గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించండి. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే నేను అడుగుతున్నాను’ అంటూ నిర్మలా సీతారామన్ రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివా్‌సను ప్రశ్నించారు. వీరవాసరం మండలం మత్స్యపురిలో గురువారం ఆర్‌ఎ్‌సఎఫ్ నీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2015లో ఆంధ్రా ఎంపీగా ఉండగా రూ.1.25 కోట్లు కేటాయించాను. ఇంతవరకూ మంచినీటి పథకాలు పూర్తి చేయకపోవడం ఏమిటి?. ఆరు గ్రామాలకు నీరు అందేలా పనిచేద్దాం’ అని చెప్పారు.