Ayyanna Patrudu: ఏపీని కాపాడుకునేందుకు బీసీలంతా ఐక్యం కావాలి..
ABN , First Publish Date - 2022-12-06T15:57:55+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకునేందుకు బీసీలంతా ఐక్యం కావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) పిలుపిచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకునేందుకు బీసీలంతా ఐక్యం కావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) పిలుపిచ్చారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బీసీలకు ఏం పీకాడని 175సీట్లు ఇస్తారు?.. జగన్ వెంట్రుకలు పీకే రోజులు దగ్గర పడ్డాయన్నారు. బీసీలు, ఇతర అన్ని వర్గాలతో పాటు సొంత సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా సీఎం జగన్‌కు లేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోత విధించి మోసం చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.
పరిపాలన చేతకాని పనికిమాలిన సన్నాసి జగన్మోహన్ రెడ్డి అని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో బీసీ (BC)లను కాదని గంజాయి వ్యాపారులు, ఇతర నేరస్తులకు పదవులు ఇచ్చారని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రకాల దోపిడీలు చేసిన జగన్మోహన్ రెడ్డి, భార్య పేరిట ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారన్నారు. ఉత్తరాంధ్రలో వైవీ సుబ్బారెడ్డి పెత్తనం చేస్తుంటే ఓ కానిస్టేబుల్‌ని కూడా బదిలీ చేయించలేని దుస్థితిలో సీనియర్ మంత్రులు ధర్మాన, బొత్స లాంటి వారు ఉన్నారన్నారు. 23వ రాజు పులికేసి సినిమాకు, జగన్మోహన్ రెడ్డికి దగ్గర పోలికలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఉండాల్సిన కళ జగన్ ముఖంలో లేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.