హరి ఓం!
ABN , First Publish Date - 2022-11-08T00:19:06+05:30 IST
జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కేదారేశ్వర వ్రతం ఆచరించారు. సాయంత్రం నదులు, చెరువులు, కాలువల్లో దీపాలు వదిలారు. సాయంత్రం ఇళ్లల్లో కార్తీక నోము నోచారు.

హరి ఓం!
జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి
కేదారేశ్వర వ్రతం ఆచరించిన భక్తులు
కిటకిటలాడిన శైవక్షేత్రాలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/శృంగవరపుకోట, నవంబరు 7: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కేదారేశ్వర వ్రతం ఆచరించారు. సాయంత్రం నదులు, చెరువులు, కాలువల్లో దీపాలు వదిలారు. సాయంత్రం ఇళ్లల్లో కార్తీక నోము నోచారు. అటు కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు బారులుదీరారు. ఆధ్యాత్మిక శోభ నెలకొంది. విజయనగరం శివాలయం వీధిలో రుద్రాక్షలతో రూపొందించిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. శృంగవరపుకోట పుణ్యగిరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరిసర మండలాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. అటు జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు, శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Read more