‘జూట్‌ కార్మికులకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2022-05-11T05:37:47+05:30 IST

చట్టవిరుద్ధంగా జూట్‌ మిల్లు మూసివేయడంతో రోడ్డునపడ్డ కార్మికులకు న్యాయం చేయాలని పలు కార్మిక సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘జూట్‌ కార్మికులకు న్యాయం చేయాలి’
ఏలూరు లేబర్‌ కార్యాలయం వద్ద ఇఫ్టూ నాయకుల ధర్నా

ఏలూరు టూటౌన్‌, మే 10 : చట్టవిరుద్ధంగా జూట్‌ మిల్లు మూసివేయడంతో రోడ్డునపడ్డ కార్మికులకు న్యాయం చేయాలని పలు కార్మిక సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. అశోక్‌నగర్‌ లేబర్‌ కార్యాలయం వద్ద ఐదు యూనియన్ల ఆధ్వ ర్యంలో జూట్‌ కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ మూసివేసిన జూట్‌మిల్లును తెరిపించాల న్నారు. ఈ కార్మికులను కొత్తూరు జూట్‌మిల్లులోకి తీసుకునే విధంగా కార్మిక శాఖా ధికారులు ఆమోదించిన క్లాజ్‌ 19ని రద్దు చేయాలన్నారు. కార్మికుల భవిష్యత్తును దెబ్బతిసే ఈ క్లాజ్‌ను తొలగించాలన్నారు. మూసివేసిన కాలానికి కార్మికులకు జీతా లు ఇవ్వాలన్నారు. జూట్‌ కార్మికులకు న్యాయం జరిగే వరకు పలు దశల్లో పోరాటం చేస్తామన్నారు. ఇఫ్టూ నాయకులు యు.వెంకటేశ్వరరావు, టీఎన్‌టీయూసీ నాయకు లు కె.ఉమాశంకర్‌, సీఐటీయూ నాయకులు జగన్నాథరావు, ఏఐటీయూసీ నాయకు లు బండి వెంకటేశ్వరరావు, ఐఎన్‌టీయూసీ నాయకులు పులి శ్రీరాములు పాల్గొన్నారు.

Read more