Kaivalya Vohra: వయసు 19 ఏళ్లు.. సంపాదన వెయ్యి కోట్లు.. ఈ అబ్బాయి కంపెనీ ఏదో మీకూ తెలుసు..!

ABN , First Publish Date - 2022-09-22T03:29:29+05:30 IST

‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ కలాం ఇచ్చిన పిలుపు కోట్లాది యువతలో నిత్య స్ఫూర్తిని నింపింది. ‘డ్రీమ్‌... డ్రీమ్‌... డ్రీమ్‌. ఆ కలలు ఆలోచనలు..

Kaivalya Vohra: వయసు 19 ఏళ్లు.. సంపాదన వెయ్యి కోట్లు.. ఈ అబ్బాయి కంపెనీ ఏదో మీకూ తెలుసు..!

‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ కలాం ఇచ్చిన పిలుపు కోట్లాది యువతలో నిత్య స్ఫూర్తిని నింపింది. ‘డ్రీమ్‌... డ్రీమ్‌... డ్రీమ్‌. ఆ కలలు ఆలోచనలు అవుతాయి. ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతాయి’ అని కలాం తెలిపారు. ‘‘కల అంటే నిద్రలో కనిపించేది కాదు! నిన్ను నిద్ర పోనివ్వకుండా చేసేది’’ అంటూ లక్ష్య సాధన దిశగా యువత గుండెలను రగిలించారు. ‘గొప్ప స్వాప్నికుల కలలకు పరిమితులు ఉండవు’ అని తెలిపారు. ఆ మాటలను అక్షరాల నిజం చేశాడు Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. అతి చిన్న వయసులోనే.. 19 ఏళ్ల వయసులోనే.. కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో నిలిచాడు. IIFL Wealth Hurun India విడుదల చేసిన ధనవంతుల జాబితాలో జెప్టో సహ వ్యవస్థాపకుడైన కైవల్య వోహ్రాకు చోటు దక్కింది.



Hurun India విడుదల చేసిన ధనవంతుల జాబితాలో వోహ్రా రూ.1000 కోట్లతో 1,036వ స్థానంలో.. పలిచ రూ.1,200 కోట్లతో 950వ స్థానంలో నిలవడం విశేషం. వీరిద్దరూ కలిసి మొదలుపెట్టిన Zepto ఈ-గ్రాసరీ బిజినెస్‌లో దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలో లాభాలను ఆర్జించి పోటీ కంపెనీలను ఔరా అని ఆశ్చర్యపోయేలా చేసింది. ముంబైకి చెందిన Zepto కంపెనీ ప్రస్తుతం దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 3000కు పైగా కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు.. డైరీ ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. 10 నిమిషాల్లో హోం డెలివరీ చేయడం ఈ జెప్టో ప్రత్యేకత. కిరాణా సరుకులే కాకుండా జెప్టో ఈ మధ్య కేఫ్ పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. ఈ జెప్టో కేఫ్‌లో కాఫీ, చాయ్, ఇతర కేఫ్ ఐటమ్స్ ఆర్డర్ చేసే అవకాశం కస్టమర్లకు ఉంది.



కిరాణా వస్తువులు డెలివరీ చేసే ఈ జెప్టో యాప్ రూ.1000 కోట్ల నికర విలువతో కైవల్య వోహ్రాను ఈ జాబితాలో నిలిపింది. ఆదిత్ పలిచ (Aadit Palicha) వ్యవస్థాపకుడిగా, కైవల్య వోహ్రా సహ వ్యవస్థాపకుడిగా 2020లో ఈ Quick Grocery Delivery App Zepto ప్రారంభమైంది. పలిచ వయయసు కూడా 20 సంవత్సరాలే కావడం విశేషం. 1,200 కోట్ల Net Worthతో పలిచ కూడా Hurun India జాబితాలో నిలిచాడు. స్టాండ్‌ఫర్డ్ యూనివర్సిటీ డ్రాపౌట్స్ అయిన ఈ ఇద్దరు యువకులు ఒక సృజనాత్మక ఆలోచనతో Zepto స్థాపించి కోట్లు ఆర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. Hurun విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం.. 1990ల్లో పుట్టిన 13 మంది యువకులు స్వయం కృషితో ఎదిగి కోటీశ్వరుల జాబితాలో నిలిచారు.

Updated Date - 2022-09-22T03:29:29+05:30 IST