DK Sivakumar: 11 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర
ABN , First Publish Date - 2022-12-23T12:31:00+05:30 IST
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ సంపూర్ణంగా సిద్దమైంది. జనవరి11 నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టినట్లు

బెంగళూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ సంపూర్ణంగా సిద్దమైంది. జనవరి11 నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) ప్రకటించారు. గురువారం బెళగావిలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రణదీప్‌సింగ్ సూర్జేవాలలతో కలిసి సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తేల్చి చెప్పారు. జనవరి 11న బెళగావిలో బస్సుయాత్ర ఆరంభించనున్నారు. నాలుగురోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను యాత్ర సాగనుందన్నారు. సంక్రాంతి సందర్భంగా రెండురోజుల విశ్రాంతి ఇస్తామని, 16నుంచి 19వ తేదీ దాకా హొసపేట, కొప్పళ, బాగల్‌కోటె, గదగ, హావేరి, దావణగెరె జిల్లాలలోను 21నుంచి మూడురోజుల పాటు హాసన్, చిక్కమగళూరు, ఉడుపి, దక్షిణకన్నడ, కోలార్, చిక్కబళ్ళాపుర జిల్లాలో యాత్రలు ఉంటాయన్నారు.