New Parliament Buidling: శరవేగంగా పార్లమెంటు భవనం పనులు: హర్దీప్ పురి
ABN , First Publish Date - 2022-11-04T20:05:19+05:30 IST
కొచ్చి: మరో నెలరోజుల్లోపే నవంబర్ గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి..
కొచ్చి: మరో నెలరోజుల్లోపే నవంబర్ గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవన (New parliament building) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep sing Puri) చెప్పారు. నవంబర్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి వచ్చే శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించాలనుకుంటున్నట్టు చెప్పారు.
కొచ్చిలో '15వ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో'ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం 4,000 మంది రేయింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. నవంబర్ గడువులోగా పూర్తవుతుందని అనుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు...''ప్రతివారం అక్కడికి వెళ్తున్నాను. చాలా వేగంగా పని జరుగుతోంది. 4 వేల మంది ఏకధాటిగా పనిచేస్తున్నారు'' అని మంత్రి సమాధానమిచ్చారు. పార్లమెంటు భవన నిర్మాణం చాలా బాగా జరుగుతోందని చెప్పారు. 2020 డిసెంబర్లో న్యూపార్లమెంట్ భవనానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిట్ ఈ భవన నిర్మాణ పనులు జరుపుతోంది.