Beach - Tambaram మధ్య నేడు పలు రైళ్లు రద్దు
ABN , First Publish Date - 2022-07-08T14:11:57+05:30 IST
స్థానిక గిండి వద్ద రైల్వేలైనులో మరమ్మతు చేపట్టనున్న కారణంగా బీచ్ - తాంబరం స్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి పలు ఈఎంయూ రైళ్లను రద్దు చేశారు.

చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక గిండి వద్ద రైల్వేలైనులో మరమ్మతు చేపట్టనున్న కారణంగా బీచ్ - తాంబరం స్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి పలు ఈఎంయూ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలిలా వున్నాయి... - రాత్రి 10.25, 10.45, 11.25, 11.45 గంటలకు తాంబరం నుంచి బీచ్‌కు బయలుదేరాల్సిన రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. - రాత్రి 10.15, 11 గంటలకు చెంగల్పట్టు నుంచి బీచ్‌కు బయలుదేరాల్సిన రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.ఫ రాత్రి 10, 10.20, 11, 11.20, 11.40, 11.59 గంటలకు బీచ్ నుంచి తాంబరానికి బయలుదేరాల్సిన రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.