Kuwaitization policy: అనుకుంది సాధించిన కువైత్.. ఆ సెక్టార్‌లో భారీగా తగ్గిన ప్రవాసులు!

ABN , First Publish Date - 2022-11-01T10:08:30+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అనుకుంది సాధించింది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచి, ప్రవాసులకు తగ్గించాలనే ఆలోచనతో ఐదేళ్ల క్రితం తీసుకొచ్చి కువైటైజేషన్ పాలసీ (Kuwaitization policy) సత్ఫలితాలను ఇస్తోంది.

Kuwaitization policy: అనుకుంది సాధించిన కువైత్.. ఆ సెక్టార్‌లో భారీగా తగ్గిన ప్రవాసులు!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అనుకుంది సాధించింది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచి, ప్రవాసులకు తగ్గించాలనే ఆలోచనతో ఐదేళ్ల క్రితం తీసుకొచ్చి కువైటైజేషన్ పాలసీ (Kuwaitization policy) సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వ రంగంలో నాన్-కువైటీ ఉద్యోగులను తగ్గించాలని సివిల్ సర్వీస్ కౌన్సిల్ జారీ చేసిన రిజల్యూషన్ నం. 11/2017 కారణంగా కువైటీ ఉద్యోగులు భారీగా పెరిగినట్లు తాజాగా వెలువడిన ఓ అధికారిక నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ సెక్టార్‌లో 5.3శాతం జాతీయ ఉద్యోగిత పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ సెక్టార్‌లో మొత్తం 2,24,054గా ఉన్న కువైటీ ఉద్యోగుల సంఖ్య 5ఏళ్లలో 39,671 పెరిగి.. 2,63,725కి చేరింది. ఇది ఆ దేశ మొత్తం ప్రభుత్వ ఎంప్లాయిమెంట్‌లో 76 శాతంగా నివేదిక పేర్కొంది. 28 ప్రభుత్వ ఏజెన్సీలలో ఇలా కువైటైజేషన్ పాలసీ ద్వారా భారీగా స్థానిక ఉద్యోగులు పెరిగారు.

అదే సమయంలో సివిల్ సర్వీస్ కౌన్సిల్ తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ నిర్ణయం కారణంగా గత ఐదేళ్లలో 9,457 మంది నాన్-కువైటీలు ప్రభుత్వ ఉద్యోగాలను విడిచిపెట్టారని నివేదిక వెల్లడించింది. దీంతో 2017లో కువైత్ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ఉన్న మొత్తం ప్రవాసుల సంఖ్య 92,697 నుంచి 83,240కి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మొత్తంగా 2,000 మంది కొత్త కువైత్ ఉద్యోగుల నియామకంతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం డీజీసీఏలో కేవలం కువైటీ ఉద్యోగులే 5,096 మంది ఉన్నారు.

Updated Date - 2022-11-01T10:39:17+05:30 IST