విమానం టాయిలెట్‌లో సిగరెట్ తాగి.. ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాహకం తెలిస్తే..
ABN , First Publish Date - 2022-11-04T12:08:57+05:30 IST
విమానంలో ఓ వ్యక్తి సిగరేట్ (Cigarette) సరదా అందులోని మిగతా ప్రయాణికులకు కొద్దిసేపు గుండె ఆగినంత పని చేసింది. ఉన్నట్టుండి విమానం టాయిలెట్ (Plane toilet) నుంచి ఒక్కసారిగా మంటలు భగ్గుమనడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: విమానంలో ఓ వ్యక్తి సిగరేట్ (Cigarette) సరదా అందులోని మిగతా ప్రయాణికులకు కొద్దిసేపు గుండె ఆగినంత పని చేసింది. ఉన్నట్టుండి విమానం టాయిలెట్ (Plane toilet) నుంచి ఒక్కసారిగా మంటలు భగ్గుమనడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. వెంటనే అప్రమత్తమైన విమానం సిబ్బంది ఆ మంటలను ఆర్పేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రయాణికుడు విమానంలో సిగరెట్ తాగి టాయిలెట్‌ను తగలబెట్టిన ఘటన బ్యాంకాక్ ఫ్లైట్‌లో జరిగింది.
ఇజ్రాయిల్ (Israel) నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఓ వ్యక్తి టాయిలెట్‌లో సిగరెట్ తాగి డస్ట్‌బిన్‌లో పడేశాడు. దాంతో డస్ట్‌బిన్‌లోని టిష్యూలకు నిప్పు (Fire) అంటుకోవడంతో టాయిలెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది ఎక్స్‌టింగ్విషర్‌లతో (Extinguishers) మంటలను ఆర్పివేశారు. ఆ తర్వాత విమానం సురక్షితంగా బ్యాంకాక్ విమానాశ్రయంలో (Bangkok Airport) ల్యాండ్ కావడంతో అందులోని ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, సదరు ప్రయాణికుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని విమానయాన సంస్థ వెల్లడించింది.