ఇప్పటికే 8 మంది భర్తలు, 11 మంది పిల్లలు.. అయినా తగ్గేదేలేదంటోంది!
ABN , First Publish Date - 2022-10-30T13:16:13+05:30 IST
ఓ మహిళకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 8 మందిని వివాహం చేసుకున్న ఆమె.. 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు 8 మందిని వివాహం చేసుకోవడం వెనక ఓ లాజిక్ ఉందని ఆమె చెబుతోంది. అదే ప్రస్తుతం నెట్టింట..
ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 8 మందిని వివాహం చేసుకున్న ఆమె.. 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు 8 మందిని వివాహం చేసుకోవడం వెనక ఓ లాజిక్ ఉందని ఆమె చెబుతోంది. అదే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటంటే..
అమెరికా(America)కు చెందిన ఆ మహిళ పేరు ఫై(Fai). ఈమె సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఈమెకు 90వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పిల్లలతో సరదాగా గడిపిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తన వ్యూవర్స్‌ను ఉత్సాహపరుస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. తాను 8 మందిని వివాహం చేసుకున్నట్టు వెల్లడించింది. 8 మంది భర్తలతో 11 మంది పిల్లలకు జన్మనిచ్చినట్టు వెల్లడించింది. అన్నీ ఆలోచించే ఈ పని చేసినట్టు ఫై పేర్కొంది. ‘ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో అతడు విడిపోయినా లేదా చనిపోయినా పిల్లలకు తండ్రి లేకుండా పోతాడు. అందుకే 8 మందిని వివాహం చేసుకున్నా. ఈ ఎనిమిది మందిలో ముగ్గురు విడిపోయినా/చనిపోయినా మరో ఐదుగురు పిల్లలకు తండ్రులుగా ఉంటారు’ అని వివరించింది. అంతేకాదు.. మరో 19 మంది పిల్లలకు( planning 30 children) జన్మనివ్వడమే తన లక్ష్యమని వెల్లడించింది. అంతేకాదు.. మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవడంపై కూడా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరేమో ఆమె ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.