గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కొడుకు.. భార్య ప్రోత్సాహంతో.. తల్లి అని కూడా చూడకుండా..
ABN , First Publish Date - 2022-11-11T17:51:19+05:30 IST
కొడుకు భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు.. చిన్నప్పటి నుంచి ఎలా కష్టం రానీకుండా బాగా చదివించారు. వారు ఆశించిన విధంగానే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. దీంతో కొడుక్కు మంచి సంబంధం చూసి వివాహం కూడా చేశారు. ఇంత చేసిన..
కొడుకు భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు.. చిన్నప్పటి నుంచి ఎలా కష్టం రానీకుండా బాగా చదివించారు. వారు ఆశించిన విధంగానే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. దీంతో కొడుక్కు మంచి సంబంధం చూసి వివాహం కూడా చేశారు. ఇంత చేసిన తల్లిదండ్రులను.. వృద్ధాప్యంలో బాగా చూసుకోవాల్సిన కొడుకు, అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్య మాటలు విని అతడు చేసిన నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
‘అవును.. నా ప్రియుడిని చంపేందుకు 2 నెలల్లోనే 10 సార్లు ప్రయత్నించా..’..
బీహార్ (Bihar) హాజీపూర్‌కు చెందిన పూల్ కుమారి అనే వృద్ధురాలికి మనోజ్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకును కష్టపడి బాగా చదివించింది. మనోజ్ ప్రస్తుతం జలవనరుల శాఖలో SDO (Sub Divisional Officer)గా పని చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు.. ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన మనోజ్.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు. భార్య చెప్పిన మాటలు విని.. తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తిపై కన్నేశాడు. రోజూ వారిని వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేసేవాడు. తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయించాలంటూ దాడులు చేసేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు.
కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..
ఇటీవల ఓ రోజు రాత్రి ఆస్తి విషయమై తల్లితో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. తల్లి అని కూడా చూడకుండా కాలితో తన్నుతూ, ముఖంపై పిడిగుద్దులు (Assault on mother) కురిపించాడు. వద్దని తండ్రి వారిస్తున్నా.. తనను పక్కకు తోసేసి మరీ దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మనోజ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. కొడుకు దాడిలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని చూసి.. అంతా అయ్యో పాపం! అని కన్నీటిపర్యంతమవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తల్లీకొడుకులు అయి ఉండి ఇదేం పని.. అచ్చం విజయ్ సినిమాల్లో చూపించినట్టుగానే..