Indhradanussu: నేనొక ప్రేమ పిపాసిని... ఈ పాటంటే ఆయనకు ఎంతో ఇష్టం.

ABN , First Publish Date - 2022-11-15T12:25:31+05:30 IST

కృష్ణగారి ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఈ పాట కూడా ఒకటి. ఆత్రేయ కూడా ఈ పాట అంతే ఇష్టపడేవారు.

Indhradanussu: నేనొక ప్రేమ పిపాసిని... ఈ పాటంటే ఆయనకు ఎంతో ఇష్టం.
Indhradanussu

కృష్ణగారికి ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఈ పాట కూడా ఒకటి. ఆత్రేయ కూడా ఈ పాట అంతే ఇష్టపడేవారు. భగ్న ప్రేమికుల హృదయాంతరాల్లో అంతులేని, తీరని ఆవేదనను మన మనసు కవి ఆత్రేయ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ పాట ప్రేమ విఫలమైన ప్రతి ఒక్కరినీ తాకకమానదు. ప్రేమలోని గాఢతను తెలుపుతూ బాలు గానంలో కలగలిసి సాగింది.

అంతేనా..

ఇంద్ర ధనుస్సు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో కృష్ణ, శారద, కె వి చలం, జయమాలిని, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, గిరి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి కె బాపయ్య దర్శకత్వం వహించగా.. నన్నపనేని సుధాకర్, టి. సుబ్బానాయుడు కలిసి నిర్మించారు. కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చారు.

మహదేవన్ స్వరాలతో పాటు అద్భుతమైన సాహిత్యం, సంగీతం, నటన కలగలిపి ప్రేమ విలువ తెలిసిన ప్రతి మనసును కదిలించింది. ఈపాటలోని పదాలకు కృష్ణగారి అభినయం అద్భుతంగా అమరింది. ఇందులోని ప్రతి పదం అద్భుతం. బాలుగారి గొంతు పాటకు ప్రాణం పోస్తే కృష్ణ, శారద గార్ల అభినయం మరో స్థాయిలో ఉంటుంది.

Updated Date - 2022-11-15T12:56:47+05:30 IST

News Hub