నాగోబా జాతరకు ముఖ్య అతిథిగా రండి
ABN , First Publish Date - 2022-11-03T00:14:00+05:30 IST
దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా జిల్లాలో నిర్వహించే కేస్లాపూర్ నాగోబా జాతరకు ముఖ్య అతిథి గా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షమే శాఖ మంత్రి అర్జున్‌ముండేకు ఎంపీ సోయంబాపు రావు, మేస్రం వంశకుల పెద్దలు ఆహ్వానించారు.

ఆదిలాబాద్ టౌన్/ ఇంద్రవెల్లి, నవంబరు2: దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా జిల్లాలో నిర్వహించే కేస్లాపూర్ నాగోబా జాతరకు ముఖ్య అతిథి గా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షమే శాఖ మంత్రి అర్జున్‌ముండేకు ఎంపీ సోయంబాపు రావు, మేస్రం వంశకుల పెద్దలు ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని కేంద్రమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సమ్మక్క-సారక్క జాతర తర్వాత దేశంలోనే అతి పెద్ద గిరిజన సంప్రదాయ నాగోబా జాతరకు మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్ర దేశ్, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, ఆదివాసీలు సంస్కృతీ, సంప్రదాయాలకు నాగోబా జాతర నెలవైందని మంత్రికి వివరించారు. జనవరి పుష్యమాసంలో 10 రోజుల పాటు జాతర ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయని, జనవరి 24న జాతరలో ప్రజాదర్బార్ జరుగనుందని, గిరిజన శాఖ మంత్రిగా రావా లని వారు కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడంతో ఆదివాసీ గిరిజనుల సమస్యల గురించి ఎంపీ ప్రస్తావించారు. అనంతరం నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. ఇందులో మేస్రం వంశపెద్దలు మేస్రం వెంకట్‌రావు, చిన్నుపటేల్, బాదిరావ్, కినక షేకు, మహజన్ మెస్రం నాగ్ నాథ్, సర్పంచ్ కోసేరావ్, కటోడా ఆనంద్‌రావ్, చైర్మన్ హన్మంత్‌రావ్, మేస్రం దాదారావు, తోడసం సాగర్, కోట్నక్ కోసేరావు, కేస్లాపూర్ ఆలయ కమిటీ సభ్యులు మెస్రం శేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.