Vijayashanti:బీఆర్ఎ‌స్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు

ABN , First Publish Date - 2022-12-02T23:57:43+05:30 IST

సీఎం కేసీఆర్(CM KCR) చెప్పే బీఆర్ఎ‌స్ పార్టీ (BRS party)జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదు. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసునని బీజేపీ(BJP)సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) వ్యాఖ్యానించారు.

Vijayashanti:బీఆర్ఎ‌స్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు

హైదరాబాద్: సీఎం కేసీఆర్(CM KCR) చెప్పే బీఆర్ఎ‌స్ పార్టీ (BRS party)జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదు. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసునని బీజేపీ(BJP)సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) వ్యాఖ్యానించారు.శుక్రవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు ఆ వార్తను యథాప్రకారం ఇస్తున్నాం.‘‘ టీఆర్ఎ‌స్ ఇక బీఆర్ఎ‌స్ కాబట్టి, పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుందనే భ్రమతో ప్రాంతేతర పార్టీలు కొన్ని ఈ పరిస్థితిని తమకు అవకాశంగా భావించి తెలంగాణలో పని చేయడమే కేసీఆర్‌కి అవసరం. ఈ కొత్త పరిణామాలు మరోసారి తెలంగాణవాద ప్రజా ఓటు బ్యాంకును ‘‘మా దశాబ్దాల పోరాట తెలంగాణపై ఈ ప్రాంతేతర పార్టీల దాడి ఏంది?... ఆక్రమణ ప్రయత్నమేంది?" అనే ఆక్రోశంతో టీఆర్ఎ‌స్ వైపు పెద్ద ఎత్తున మళ్లించడమే సీఎం వ్యూహంగా అర్థం చేసుకుంటే అది వాస్తవ దూరం మాత్రం తప్పకుండా కాదు. ఇప్పటి రోజువారీ సంఘటనలు అందుకు దారి తీసేటట్లుగానే నడుస్తున్నట్లు దశాబ్దాల కాలపు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఎందరో ఉద్యమకారులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు’’ అని విజయశాంతి అన్నారు.

Updated Date - 2022-12-03T00:01:14+05:30 IST