మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
ABN , First Publish Date - 2022-09-29T06:18:01+05:30 IST
రానున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు.

మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
చండూరు, సెప్టెంబరు 28: రానున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ బూతస్థాయి సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పైసా రాజకీయాలు చేస్తున్నాయ ని, ప్రజాస్వామ్యం గెలవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలతో అధికారంలో కి వచ్చిన ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల రాష్ట్రం గా మార్చాడని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం ఐదు లక్షల కోట్ల అప్పులతో మిగిల్చారని అన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో డబుల్ బెడ్రూం, రైతులకు రుణమాఫీ, దళితుల కు మూడెకరాల భూమి వంటి పథకాల అమలు, యువతకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న చర్లగూడెం, కిష్టరాయినపల్లి భూనిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేవంలో మత విద్వేశాలు రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీజేపీని, రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎ్‌సని ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మునుగోడు బీజేపీకి డిపాజిట్ కూడా రాదని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్ల కోసం బీజేపీలోకి వెళ్లి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్వించారు. ప్రజల పక్షాన నిలిచి వారి సంక్షేమం కోసం సుభిక్ష పాలన అందించే కాంగ్రేస్ పార్టీని ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అధిక మెజారిటీతో గెలిపించి మునుగోడు అడ్డా కాంగ్రెస్ అడ్డాగా మరోసారి రుజువు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, యూత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి, పున్న కైలా్‌షనేత, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, బురుకల బిక్షం, గండు వెంకట్‌గౌడ్, సుజావుద్దీన, పన్నాల లింగ య్య, మంచుకొండ సంజయ్, శ్యామ్ పాల్గొన్నారు.
స్రవంతిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం
మర్రిగూడ, సెప్టెంబరు 28: కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిరెడ్డిని గెలిపించాలని టీపీసీసీ సభ్యుడు, మర్రిగూడ క్లస్టర్ ఇనచార్జి చింతలపల్లి జగదీశ్వర్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని కొట్టాల, ఇందుర్తి గ్రామాల్లో పాల్వాయి స్రవంతిరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మునుగోడు వెనుకబాటుకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. పాల్వాయి స్రవంతిరెడ్డిని మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించినట్లయితే అభివృద్థి జరుగుతుందని ఆయన అన్నారు. రెండు రోజుల నుండి రెండు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.