ఆధునిక వ్యవసాయ పితామహుడు గోపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-04-16T07:12:45+05:30 IST
ఆధునిక వ్యవసాయ పితామహుడు డాక్టర్ ఘంటా గోపాల్‌రెడ్డి అని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో ఘంటా గోపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి యాంత్రీ కరణ జోడించి సమిష్టి వ్యవసాయాన్ని అందించిన గొప్ప వ్యవసాయ విప్లవ కర్త అని కొనియాడారు.

గరిడేపల్లి రూరల్, ఏప్రిల్ 15: ఆధునిక వ్యవసాయ పితామహుడు డాక్టర్ ఘంటా గోపాల్‌రెడ్డి అని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో ఘంటా గోపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి యాంత్రీ కరణ జోడించి సమిష్టి వ్యవసాయాన్ని అందించిన గొప్ప వ్యవసాయ విప్లవ కర్త అని కొనియాడారు. గ్రామంలో కేవీకేని స్థాపించి తద్వార లిప్ట్ అంటే తెలియని రోజుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల కు సాగునీరు అందించిన మహనీయుడని అన్నారు ఒక సొసైటీ, బ్యాంక్, పాఠశాలల ఏర్పాటు చేసి తన జీవితాన్ని గోపాల్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. సొంత పొలాలను అందిం చి తన పిల్లల కంటే ఎక్కువగా వ్యవసాయాన్ని ప్రేమించి చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి బాట పట్టించిన గోపాల్‌రెడ్డికి పద్మశ్రీ/పద్మవిభూ షణ్ అవార్డును ప్రకటించి గౌరవించాలన్నారు. గడ్డిపల్లి కేవీకేకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలో ఎత్తిపోతల పథకాల ఆధునీకీకరణను ప్రారంభిస్తామని, ప్రతీ గ్రామంలో సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కేవీకే కు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ శైలజరెడ్డి, సర్పంచ్ సుందరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మేకల స్రవంతిశోభన్‌బాబు, పీఏసీఎస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, ఘంటా రత్నమాల, కేవీకే కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డి, అమరేందర్‌రెడ్డి, సింగారెడ్డి, బిట్టు నాగేశ్వర రావు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గామస్థులు పాల్గొన్నారు.