మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో జయ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2022-11-05T23:37:45+05:30 IST
జాతీయ స్థాయిలో నిర్వహించిన అసోసియోషన్ ఫర్ మ్యాథమాటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా గణిత ఒలంపియాడ్‌లో జిల్లా కేంద్రానికి చెందిన జయపాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సూర్యాపేటఅర్బన్, నవంబరు 5 : జాతీయ స్థాయిలో నిర్వహించిన అసోసియోషన్ ఫర్ మ్యాథమాటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా గణిత ఒలంపియాడ్‌లో జిల్లా కేంద్రానికి చెందిన జయపాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆపాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అబినందించి మాట్లాడారు. ప్రైమరీ లెవల్ నుండి 13మంది, సబ్ జూనియర్ లెవల్ నుండి 28 మంది, జూనియర్ లెవల్ నుండి 29 మంది అర్హత సాధించినట్లు తెలిపారు, కార్యక్రమంలో డైరెక్టర్‌లు జల్లా పద్మ, బింగి జ్యోతి, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.