TS Politics: మంత్రి ఎర్రబెల్లిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-12-27T13:40:52+05:30 IST
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మంగళవారం భేటీ అయ్యారు.
![TS Politics: మంత్రి ఎర్రబెల్లిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హనుమకొండ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ (Minister Errabelli Dayakar rao) రావుతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య (MLA Podem Veeraiah) మంగళవారం భేటీ అయ్యారు. హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రితో వీరయ్య మంతనాలు నిర్వహించారు. కాగా.. వీరయ్య గూబాబీ గూటికి చేరబోతున్నారన్న విషయాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN- Andhrajyothy) ముందే చెప్పింది. ఏబీఎన్ కథనాలకు బలాన్ని చేకూరుస్తూ ఎర్రబెల్లితో వీరయ్య సమావేశమయ్యారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka)పై బీఆర్ఎస్ (BRS) నుంచి వీరయ్యను పోటీకి దింపుతారని ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే భద్రాచలంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ గురించి మాత్రమే మంత్రితో చర్చించానని ఎమ్మెల్యే వీరయ్య చెబుతున్నారు. కాగా మంత్రితో వీరయ్య సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.