మహిళల్లో చైతన్యం రావాలి

ABN , First Publish Date - 2023-08-01T00:31:07+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలపై మహిళల్లో చైతన్యం రావాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

మహిళల్లో చైతన్యం రావాలి
ముత్యాలంపల్లిలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న పరిటాల సునీత

రామగిరి, జూలై 31: వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలపై మహిళల్లో చైతన్యం రావాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలంపల్లిలో మిని మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఇంటిం టికి తిరిగి కరపత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, ఈ విషయాలను ప్రజలు గమనించి టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుధాకర్‌, స ర్పంచ, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీదర్‌నాయుడు, ఎంపీటీసీ శ్రీనివాసులు,ఎస్సీసెల్‌ నియోజకవర్గం ప్ర ధాన కార్యదర్శి పోతన్న, మాజీ సర్పంచ నారా యణప్ప, స్థానిక నాయకులు సురేశ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-01T00:31:07+05:30 IST