AP Govt: ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-28T20:28:50+05:30 IST
ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ (Suryanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ: ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ (Suryanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నుంచి తీవ్ర ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే ఉత్తరాంధ్రలో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమస్యలపై సీఎం, మంత్రులు, సీఎస్‌కు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని, అందుకే ఆందోళన బాట పడుతున్నామన్నారు. తమ హక్కుగా ఉన్న ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం బకాయిపడిందన్నారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం.. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా.. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పడిందని ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘం పైన కోర్టులో కేసులు వేసారు. ఈ సంఘం పైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తాజాగా ఏపీ ఎన్జీవో సంఘ నేత ప్రకటించారు.