Ayyanna Patrudu: లోకేష్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తలపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-09-20T17:07:49+05:30 IST
జగన్ సర్కారుపై (Jagan Govt) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: జగన్ సర్కారుపై (Jagan Govt) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన మీడియాకు వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాత లోకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై మొన్న ఢిల్లీలో చర్చించాం. పార్టీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు. లోకేష్‌ను అరెస్టు చేస్తే నారా బ్రాహ్మిణిని ముందు పెట్టి పార్టీని నడిపిస్తాం. ఈ అంశంపై మొన్న ఢిల్లీలో నేతలు కూర్చున్నప్పుడు చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్తం చాలా గొప్పది. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు." అని అయ్యన్నపాత్రుడు అన్నారు.