BJP leader Satya Kumar: పధకం ప్రకారమే నాపై వైసీపీ గూండాల దాడి

ABN , First Publish Date - 2023-03-31T16:11:04+05:30 IST

పధకం ప్రకారమే తనపై ‌దాడి చేశారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP leader Satya Kumar) ఆరోపించారు.

BJP leader Satya Kumar: పధకం ప్రకారమే నాపై వైసీపీ గూండాల దాడి

అమరావతి: పధకం ప్రకారమే తనపై ‌దాడి చేశారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP leader Satya Kumar) ఆరోపించారు. తన కారును పోలీసులే ఆపారని.. ఎందుకు ఆపారని అడిగే లోపే తన వాహనంపై వైసీపీ (YCP) గూండాలు దాడి చేశారని సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని బీజేపీ నేత సత్యకుమార్‌ డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి (JAGANREDDY) తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఏపీలో వైసీపీ అరాచకానికి అడ్టుకట్ట వేస్తామని సత్యకుమార్‌ హెచ్చరించారు.

మందడం దగ్గర బీజేపీ నేత సత్యకుమార్‌ వాహనాన్ని వైసీపీ గూండాలు అడ్డుకున్నాయి. బీజేపీ నేత సత్యకుమార్‌ కారుపై రాళ్లతో వైసీపీ గూండాలు దాడి చేశాయి. దీంతో వాహనాన్ని ఆపకుండా సత్యకుమార్‌ డ్రైవర్‌ ముందుకుపోనిచ్చారు. వైసీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వైసీపీ గూండాల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. సీఎం జగన్‌రెడ్డి ఆదేశాలతోనే సత్యకుమార్‌ దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తల ఆందోళన చేస్తున్నారు.

1200వ రోజు అమరావతి ఉద్యమానికి బీజేపీ తరపున జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు ప్రకటించారు. మందడం శిబిరం నుంచి తుళ్లూరు పార్టీ నేత పరామర్శకు సత్యకుమార్ వెళ్లారు. తిరిగి వస్తుండగా మందడం సమీపంలో 3 రాజధానుల శిబిరం దగ్గర సత్యకుమార్ వాహనాన్ని శిబిరంలోని వ్యక్తులు అడ్డుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్లోని కార్లపై వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశాయి.

'ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని ఎంపీ సురేష్ అన్నారంటే అర్థం ఏంటీ?, ఆదినారాయణ రెడ్డి మీద బాబాయ్ గొడ్డలి పోటు పడేదా?' అని సత్యకుమార్‌ ప్రశ్నించారు. తాడేపల్లి నుంచే పోలీసులకు ఆదేశాలని, తాను డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. జగన్‌రెడ్డి గుర్తు పెట్టుకో.. తమరే కాదు.. తాము కడప జిల్లా నుంచే వచ్చామని, పోలీసులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఎందుకు? అని ప్రశ్నించారు. జగన్‌ రెడ్డి మోసాలను ప్రశ్నిస్తే... దాడి చేస్తారా?, పార్టీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-31T16:38:07+05:30 IST