Chintamohan: పేదలు పేదలుగానే ఉంటున్నారు..

ABN , First Publish Date - 2023-05-23T12:19:24+05:30 IST

బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు బాగలేవని, పేదలు పేదలుగానే ఉంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. పార్లమెంట్ భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారని విమర్శించారు.

Chintamohan: పేదలు పేదలుగానే ఉంటున్నారు..

అమరావతి: బీజేపీ (BJP) పాలనలో దేశ పరిస్థితులు బాగోలేవని, పేదలు పేదలుగానే ఉంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ (Chintamohan) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ భవనాన్ని (Parliament Building) మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి (President) చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ (PM Modi) చేస్తున్నారని, పేదలను బ్యాంకులు పట్టించుకోవడం లేదని.,. కార్పొరేట్లకు మాత్రమే రుణాలు ఇస్తున్నారని.. వాళ్ళు ఎగ్గొడుతున్నారని అన్నారు.

జగన్ ప్రభుత్వం (Jagan Govt.) ఏపీ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ నిలిపివేశారని చింతామోహన్ విమర్శించారు. ఏపీలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఏపీలో రెండు సామాజిక వర్గాలు 70, 75 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, 2024లో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యాన్, సైకిల్ పరిస్థితి చూసి నవ్వుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, 120 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుడా చిరంజీవి (Chiranjeevi)లా అయోమయంలో పడిపోయారని, చిరంజీవికి రాజకీయం తెలియదని చింతామోహన్ అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి ముఖ్యమంత్రి కావలసిన వారని, అయితే రాజకీయ అనుభవం లేక ముఖ్యమంత్రి కాలేదని.. తనకు చిరంజీవి మంచి మిత్రుడని అన్నారు. పార్టీ వీడిన వారిని వెనక్కి పిలవనని...వస్తే కదాననని అన్నారు. మళ్లీ అధికారంలోకి జగన్ రారని.. రాలేరని.. ఆయన పని అయిపోయిందని అన్నారు. ఏపీలో సంక్షేమం అసలు ఎవరికి వెళ్తుందో తెలీదని, ఎస్సీలు, ఎస్టీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ గురించి తాను మాట్లాడనని చింతామోహన్ అన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-23T12:19:24+05:30 IST