Share News

Cyclone Effect: చిత్తూరులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం

ABN , First Publish Date - 2023-12-05T15:08:17+05:30 IST

Andhrapradesh: చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఎస్‌ఆర్ పురం, కార్వేటినగం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి.

Cyclone Effect: చిత్తూరులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఎస్‌ఆర్ పురం, కార్వేటినగం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. సుమారు 15 గ్రామాలకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జలాశయంలో రెండు గేట్ల ద్వారా నీటిని బయటకు విడుదల చేశారు. కృష్ణాపురం జలాశయంలో ఒక గేటు ద్వారా అధికారులు నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


గంగాధర నెల్లూరు మండల పరివాహక ప్రాంతమైన నీవానదిలో వరద ప్రవాహం ఉధృతి అధికంగా ఉంది. రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్ఆర్ పేటకు వెళ్లే రహదారి వరదప్రవాహానికి కొట్టుకుపోవడంతో పలు గ్రామాల ప్రజలుకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షాలకు వరి, ఇతర పంటలు నీట మునిగాయి. జిల్లా పడమటి మండలాల్లో జడి వానకు పొలాల్లోనే వరి మగ్గి మొలకెత్తుతుండంతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది.

Updated Date - 2023-12-05T15:08:40+05:30 IST