AP News: సీఎం జగన్ పుట్టిన రోజు కానుక.. వాలంటీర్స్‌కు శుభవార్త
ABN , Publish Date - Dec 21 , 2023 | 09:57 AM
Andhrapradesh: వాలంటీర్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్‌కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల: వాలంటీర్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్‌కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageshwar rao) ప్రకటన చేశారు. గురువారం మంత్రి కారుమూరి నాగేశ్వరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి దోచుకున్నందుకే జగన్ పాలన పోవాలంటున్నారని మండిపడ్డారు. జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతాఉందన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని మంత్రి కారుమూరి నాగేశ్వరావు ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...