Chandrababu: ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డికి దోచిపెడుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-08-05T19:54:07+05:30 IST

ప్రాజెక్టుల పేరుతో రూ.5000 కోట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెడుతున్నారని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్‌ నాశనం చేసిందని ద్వజమెత్తారు. ప్రాజెక్ట్‌ల విధ్వంసంపై నిలదీస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డికి దోచిపెడుతున్న ప్రభుత్వం

శ్రీకాళహస్తి(Srikalahasti): ప్రాజెక్టుల(projects) పేరుతో రూ.5000 కోట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy)కి దోచిపెడుతున్నారని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టుల(Water projects) ను వైసీపీ సర్కార్‌(YCP Govt) నాశనం చేసిందని ద్వజమెత్తారు. ప్రాజెక్ట్‌ల విధ్వంసంపై నిలదీస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సైకో పోవాలని పోస్టర్లు పెడితే తీసేస్తున్నారని మండిపడ్డారు.సైకో అనే పోస్టర్లు ఉంటే కలెక్టర్‌కు, ఎస్పీకి ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులు పూర్తైతే శ్రీకాళహస్తి అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఏపీలో భూమి విలువ పడిపోయిందన్నారు.వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని నిలదీశారు. ప్రతి మండలంలో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-05T20:19:19+05:30 IST

News Hub