LokeshYuvaGalam: బాబోయ్... లోకేష్ పాదయాత్రకు మరీ ఇన్ని అడ్డుంకులా...

ABN , First Publish Date - 2023-02-17T11:07:04+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 22వ రోజు మొదలైంది.

LokeshYuvaGalam: బాబోయ్... లోకేష్ పాదయాత్రకు మరీ ఇన్ని అడ్డుంకులా...

తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra) 22వ రోజు మొదలైంది. శుక్రవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని బైరాజు కండ్రిగ విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర (YuvaGalamPadayatra)ను ప్రారంభించారు. కాసేపటి క్రితమే శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురంలోని పాదయాత్ర (NaraLokesh) ప్రవేశించింది. లోకేష్‌ (YuvaGalam)కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు అక్కడకు తరలివచ్చారు. అయితే శ్రీకాళహస్తి (Srikalahasti) లో పాదయాత్రను జరగకుండా చూసేందుకు పోలీసులు, ప్రభుత్వం (AP Government) అనేక రకాల నిబంధనలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీవిని ఎరుగనిరీతిలో ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం పాదయాత్ర (YuvaGalamLokesh)లో ప్రతీకార్యకర్తకు ఇద్దరు పోలీసులు ఉన్నారు. లోకేష్‌ పాదయాత్ర (Padayatra)ను అడ్డుకునేందుకు పోలీసుల యంత్రాంగం ఏ స్థాయిలో చర్యలు తీసుకుందో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు ఇచ్చిన పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను పోలీసులు నిరాకరించారు. తాము చెప్పిన మార్గంలోనే పాదయాత్ర చేసుకోవాలని పోలీసులు మౌకిక ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సాకుతో పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ ఇచ్చిన రూట్‌‌మ్యాప్ ఇదే...

ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు లోకేష్ పాదయాత్ర చేసే ప్రాంతాల వివరాలను పోలీసులకు టీడీపీ శ్రేణులు అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామం నుంచి కొత్త కండ్రిగ, రాజీవ్ నగర్ కాలనీ రామచంద్రపురం బంగారమ్మ కాలనీ మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకూ పాదయాత్ర జరగనుంది. అక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల గుండా పంచాయతీ రాజ్ అతిథిగృహం, బీపీ అగ్రహారం, పొన్నాలమ్మ గుడి మీదుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బస ప్రదేశానికి యాత్ర చేరుకునేలా టీడీపీ నేతలు రూట్ మ్యాప్ రూపొందించారు. ఆ మేరకు పోలీసులకు ఎప్పుడో వివరాలను కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తొలుత సూచించిన రూట్ మ్యాప్‌నకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపేట, తెట్టు, భాస్కర్ పేట వియ్యంపల్లి నుంచి నాయుడుపేట బైపాస్ మీదుగా ఏఎం పుత్తూరు నుంచి బీపీ అగ్రహారం పొన్నాలమ్మ గుడి నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బస ప్రదేశం వరకూ యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2023-02-17T11:07:05+05:30 IST