హోరాహోరీగా ఖోఖో పోటీలు
ABN , First Publish Date - 2023-01-11T00:43:34+05:30 IST
కాకినాడ జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయ ఖోఖో టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.
ధర్వాడ్,భారతీయార్, ఏఎన్‌యూ,మదురై కామరాజు, కన్నూర్, మైసూర్, కాకినాడ జేఎన్టీయూకే వర్సిటీలు ముందంజ
పర్యవేక్షించిన పరిశీలకులు, అధికారులు, కోచ్‌లు
జేఎన్టీయూకే, జనవరి 10: కాకినాడ జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయ ఖోఖో టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన పోటీలలో తెలంగాణా యూనివర్శిటీపై ధర్వాడ్‌లోని అగ్రికల్చర్ సైన్సెస్ యూనివర్శిటీ ఖోఖో జట్టు 19-8 స్కోర్ తేడాతోనూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీపై భారతీయార్ యూనివర్శిటీ జట్టు 22-9 స్కోర్ తేడాతోనూ గెలుపొందినట్లు వర్శిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి, టోర్నమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ జి.శ్యామ్‌కుమార్ తెలిపారు. అదేవిదంగా ఏఎన్‌యూ జట్టు పాలమూరు యూనివర్శిటీ జట్టుపై 25-10 స్కోర్ తేడాతోనూ మదురై కామరాజు యూనివర్శిటీ జట్టు బెంగుళూరులోని యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సె్‌సపై 18-12, విజయనగర శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీపై కన్నూర్ యూనివర్శిటీ జట్టు 13-12 స్కోర్ తేడాతో గెలుపొందాయి. మహాత్మాగాంధీ యూనివర్శిటీ జట్టుపై మైసూర్ యూనివర్శిటీ జట్టు 15-13 స్కొర్ తేడాతోనూ యోగివేమన యూనివర్శిటీపై కాకినాడ జేఎన్టీయూకే ఖోఖోజట్టు 13-12 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. అదేవిధంగా యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్, ఉస్మానియా యూనివర్శిటీ జట్టు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంజట్టు సంబంధిత ప్రత్యర్ధి జట్లపై గెలుపొందాయన్నారు. ఈ పోటీలు ఈనెల 12 వరకూ కొనసాగుతాయని శ్యామ్‌కుమార్ తెలిపారు.