పంట పండింది!
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:47 AM
తూర్పు పంట పండింది..దీంతో రబీ కోతలు ఆరంభమయ్యాయి. జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజానగరం,కోరుకొండ, సీతానగరం, రం గంపేట,గోకవరం మండలాల్లో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమ య్యా యి.

- (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
తూర్పు పంట పండింది..దీంతో రబీ కోతలు ఆరంభమయ్యాయి. జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజానగరం,కోరుకొండ, సీతానగరం, రం గంపేట,గోకవరం మండలాల్లో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమ య్యా యి.జిల్లాలో 60,042 హెక్టార్లలో వరి ఆయకట్టు ఉండగా రబీలో 58, 586 హెక్టార్లలో వరిసాగు చేశారు.రాజమహేంద్రవరం రూరల్‌లో 1299 హెక్టార్లు సాగుచేయగా ఇప్పటికే 700 హెక్టార్లలో కోతలయ్యా యి. ఇది 53.9 శాతం. సీతానగరం మండలంలో 4443 హెక్టార్లలో సాగుచేయగా 800 హెక్టార్లలో కోతలయ్యాయి. ఇది 18శాతం. రాజా నగరంలో 3229 హెక్టార్లలో సాగుచేయగా 259 హెక్టార్లలో పూర్త య్యాయి. ఇది 8 శాతం.కోరుకొండలో 2251 హెక్టార్లలో సాగు చేయగా 320 హెక్టార్లలో కోతలయ్యాయి. 14.2 శాతం. గోకవరం మండలంలో 1989 హెక్టార్లలో సాగు చేయగా 20 హెక్టార్లలో కోశారు. ఇది 1 శాతం. రంగంపేటలో 849 హెక్టార్లలో సాగు చేయగా 83 హెక్టార్లలో కోశారు. ఇది. 9.8 శాతం. చాగల్లులో 3307 హెక్టార్లలో సాగు చేయగా కేవలం 2 హెక్టార్లలో మాత్రమే కోశారు. పెరవలిలో 3305 హెక్టార్లలో సాగు చేయగా 8 హెక్టార్లలో కోశారు. గోపాలపురంలో 2221 హెక్టార్లలో సాగు చేయగా 12 హెక్టార్లలో కోశారు.మిగతా మండలాల్లో ఇంకా కోతలు ఆరంభంకాలేదు.మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు జిల్లాలో ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడి వస్తుందని తెలి పారు.