Share News

కలసిమెలసి..

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:43 AM

రంజాన్‌ మాసం ఇచ్చే గొప్ప పిలుపు దాతృత్వమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం ఆనంద్‌ రీజెన్సీ పందిరి హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా స్థాయి ఇఫ్తార్‌ విందు ఇచ్చారు.

కలసిమెలసి..
ఇఫ్తార్‌ విందులో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి చిత్రంలో ఎస్పీ నరసింహకిశోర్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం ఇచ్చే గొప్ప పిలుపు దాతృత్వమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం ఆనంద్‌ రీజెన్సీ పందిరి హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా స్థాయి ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. తొలుత ముస్లిం పెద్దలు నమాజ్‌ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వ పక్షాన కలెక్టర్‌ ఇఫ్తార్‌ విం దు ఇచ్చారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ దైవంపై నమ్మకం కలుగచేసే గొప్ప గ్రంథం ఖురాన్‌ అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనదన్నారు.నగరంలో నెల రోజులుగా ప్రతి మసీదు ఇఫ్తార్‌లో పాల్గొనడం జరిగిందన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ మతం అనేది విశ్వాసం , నమ్మకం అన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ సహనానికి, తోటివారికి తనకున్నదాన్ని పంచడం అనే గొప్పసందే శం ఇచ్చే రంజాన్‌ మాసం స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. ఎస్పీ నరసింహకిశో ర్‌ మాట్లాడు తూ అజ్మీర్‌ దర్గా వద్ద జరిగే కార్యక్రమంలో సుమారు 70 నుంచి 80 వేల మంది పాల్గొన్నా ఒక్క కానిస్టేబుల్‌ కూడా లేకుండా క్రమశిక్షణ కలిగిన తీరును ప్రదర్శించడం ఎంతో స్పూర్తి ఇచ్చిందన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌ విందును స్వీకరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌వో టి.సీతారామమూర్తి, ఆర్‌డీవో ఆర్‌.కృష్ణనాయక్‌,ఎండీ అబ్దుల్లా, ఎస్‌కె.అమీర్‌రాజా, బషీర్‌ భాయ్‌, మహబూబ్‌ ఖాన్‌, మహబూబ్‌ జానీ, బాషా ఖాన్‌, జానీ భాయ్‌, జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ,నగర అధ్యక్షుడు వై.శ్రీను, నక్క చిట్టిబాబు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:43 AM