Share News

52,173 మంది ఏమయ్యారు!

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:45 AM

మరో రెండు రోజుల్లో తొలివిడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకంలో తొలి సిలిండర్‌ ప్రయోజనాన్ని జిల్లాలో ఇంకా 52,173 మంది అందుకోవాల్సి ఉంది.

52,173 మంది ఏమయ్యారు!
గ్యాస్‌ సిలిండర్‌

ఇంకనూ అందుకోని లబ్ధిదారులు

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : మరో రెండు రోజుల్లో తొలివిడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకంలో తొలి సిలిండర్‌ ప్రయోజనాన్ని జిల్లాలో ఇంకా 52,173 మంది అందుకోవాల్సి ఉంది.ఈ నెల 31వ తేదీ వరకూ మాత్రమే తొలి ఉచిత సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎంతమంది లబ్ధిదారులు వినియోగించుకుంటారనే దానిపై జిల్లా పౌరసరఫరాల అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన వారికి ప్రయోజనం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.దీనిలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని గ్యాస్‌ డీలర్ల ద్వారా లబ్ధిదారులకు సమాచారం అందజేస్తు న్నారు. జిల్లాలో మొత్తం 4,68,010 మంది ఎల్‌పీజీ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకూ 4,15,837 మంది గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారు. వారిలో గురువారం నాటికి 4,05,747 మందికి గ్యాస్‌ డెలివరీ చేశారు.మరో 10,090 మందికి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేయాల్సి ఉంది.ఒకట్రెండు రోజుల్లో వీరికి గ్యాస్‌సిలిండర్‌ డెలివరీ జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అర్హత కలిగి గ్యాస్‌ బుక్‌ చేసుకోని 52,173 మందిలో ఎంతమంది ప్రయోజనాన్ని పొందుతారనేది చూడాల్సి ఉంది.

Updated Date - Mar 29 , 2025 | 12:45 AM