గెలుపు మనదే
ABN , First Publish Date - 2023-09-03T01:35:04+05:30 IST
రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం. ఇకపై ఏ ఎన్నిక జరిగినా గెలిచేది తెలుగుదేశం పార్టీయే. వైసీపీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం
ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశానిదే గెలుపు
ప్రతి నియోజకవర్గం నుంచి సైకిల్‌ను గెలిపించి అమరావతికి పంపండి
ఉమ్మడి గోదావరి జిల్లాల జోన్-2 విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు
భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేర్చాలని కేడర్‌కు ఆదేశం
వైసీపీ అరాచకాలను ప్రజలకు వివరించి దోషులుగా నిలబెట్టాలని దిశానిర్దేశం
ప్రతి కార్యకర్త పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఇస్తామన్న చంద్రబాబు
మరోపక్క ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో వైసీపీ చిచ్చురేపుతోందని ఆగ్రహం
రాజమహేంద్రవరం-కాకినాడ రోడ్డును బాగుచేయలేని సీఎం అంటూ ధ్వజం
కాకినాడ (ఆంధ్రజ్యోతి)/సర్పవరం, సెప్టెంబరు2 : ‘‘రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం. ఇకపై ఏ ఎన్నిక జరిగినా గెలిచేది తెలుగుదేశం పార్టీయే. వైసీపీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. విధ్వంసం, అరాచకం, వేధింపులతో సాగుతున్న జగన్ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరు ఆగ్రహంతో ఉన్నా రు. గడిచిన 45 ఏళ్లలో ఎప్పుడు ఈస్థాయి ప్రజా వ్యతిరేకత చూడలేదు. అయితే దీన్ని ధీమాగా తీసుకోకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. ఈ ఆరు నెలలు గట్టిగా పోరాడితే విజయం మనదే. సైకిల్‌ను ఆపేవారెవరూ లేరు. పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి ఈసారి సమున్నతంగా గౌరవించే బాధ్యత నాది’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉన్నత భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పిం చారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార వైసీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని, దీనిని ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జి ల్లాల జోన్-2 సమావేశం శనివారం కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో జరిగింది. దీనికి హాజరైన చంద్రబాబు వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు. ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాల్లో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నడిరోడ్డుపై యథేచ్ఛగా హత్యలు జరు గుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం-కాకినాడ రహదారిని బాగు చేయలేని సీఎం ఏం సీఎం అం టూ ధ్వజమెత్తారు. జోన్-2 సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది. అయితే శని వారం ఉదయం భారీ వర్షం కారణంగా తిమ్మాపురంలోని సభా ప్రాంగణం జలమయమైంది. దీంతో అప్పటికప్పుడు నీటిని తోడి యథావిధిగా సమావేశాన్ని ప్రారంభించారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు అచ్చెన్నాయుడు, ఆ తర్వాత మాజీ మంత్రులు బం డారు, ప్రత్తిపాటి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఓట ర్ల జాబితాలో అవకతవకలను ప్రతి బూత్ ఇంచార్జి పసి గట్టి వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వారు సూచించారు. ఇక రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు దిగిన చంద్రబాబు మూడు గంటలకు తిమ్మాపురంలోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన 36 నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలు, బూత్, క్లస్టర్, యూనిట్, మండల అధ్యక్షులనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల రాష్ట్రం ఏ స్థాయిలో దిగజారిపోయిందో కూలంకుషంగా వివరిం చారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ జగన్ పాల నలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని వివ రించారు. నవరత్నాల పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలను జగన్ జనం నుంచి కొట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ, సాగునీటి రంగాలను సర్వనాశ నం చేసి, మద్యం, ఇసుకతో వేల కోట్లు తినేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కొత్తపేట నియోజకవర్గంలో తాను పర్యటించినప్పుడు జొన్నాడ ఇసుక ర్యాంపు పేరుతో జరు గుతున్న దోపిడీని బయటపెట్టానని చెప్పారు. 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అక్కడి నుంచి తరలిపోతోందన్నా రు. నాలుగేళ్ల పాలన వైఫల్యాలను చంద్రబాబు వివరిం చారు. అయితే మళ్లీ మోసం చేసి అఽధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ ఆటకట్టించాలని పార్టీ కేడర్‌తోపాటు ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో పచ్చని గోదా వరి జిల్లాలు సైతం నాశనమైపోయాయన్నారు. ఇటీవల అమలాపురంలో నడిరోడ్డుపై హత్యలు జరగడం ఏంటని ప్రశ్నించారు. రౌడీయిజం పెరిగిపోవడంతో గోదావరి జిల్లా లు కలవరపడుతున్నాయన్నారు. పోలీసు వ్యవస్థ సైతం నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తాను రాజమహేంద్రవరం విమానాశ్రయం దిగి అక్కడి నుంచి కాకినాడకు ఏడీబీ రోడ్డులో వచ్చానని, నాలుగేళ్లుగా దీన్ని బాగు చేయలేని ముఖ్య మంత్రి ఏం సీఎం అని నిప్పులు చెరిగారు.
మీ వెంటే ఉంటా...
వేలల్లో తరలివచ్చిన పార్టీ నేతలు, కేడర్‌నుద్దేశించి చంద్రబాబు ప్రతి కార్యకర్తలో భరోసా నింపేలా ప్రసంగించారు. వారి పనితీరును కూడా మెచ్చుకున్నారు. పార్టీ ప్రకటించిన 45 రోజుల భవిష్యత్తు గ్యారెంటీ పథకాలను ఇంటింటా మరింత మెరుగ్గా తీసుకువెళ్లాలని సూచించారు. వైసీపీ తన నాలుగేళ్ల పాలనలో కరపత్రాలు పంచు తుంటే.. టీడీపీ మాత్రం కోతలు, నిబంధనల సాకులు లేకుండా భవి ష్యత్తులో చేయబోయే మేలుకు ముందే గ్యారెంటీ కల్పిస్తుందన్నారు. ఇప్పటివరకు కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, పోలీసుల కేసులు, అధికార పార్టీ వేధింపులు తట్టుకున్నారన్నారు. ఇప్పటికీ చాలామంది జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఆరు నెలలు పోరాట పంథాను వదలకుండా పనిచేయాలని సూచిం చారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గౌరవించే బాధ్యత తన దని భరోసా ఇచ్చారు. ప్రమోషన్ల కోసం నేతల రికమండేషన్లు అక్కర్లే దని, ఎవరి పనితీరు ఎలా ఉందో తాను ఎప్పటికప్పుడు నివేది కలు సిద్ధం చేస్తున్నానన్నారు. అనంతరం 36 నియోజకవర్గాల పరిధి లోని కొన్ని బూత్, యూనిట్ ఇన్‌చార్జుల పనితీరును చంద్రబాబు సమీక్షిం చారు. అందరి ముందే వారి పనితీరును చదివి వినిపించారు. తొలు త తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని యూనిట్ ఇన్‌చార్జి పరిమి కుమార్ పనితీరుపై మాట్లాడుతూ బాగా పనిచేస్తున్నారని, కాకపోతే కోపం తగ్గించుకోవాలంటూ సరదాగా మాట్లాడారు. ఒక్కో బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌కు సంబంధించి దాదాపు 20 అంశాల్లో పనితీరును చంద్రబాబు సమీక్షించారు. నియోజవర్గాల పరిధిలో నేత లు అప్పుడప్పుడూ ‘టీ విత్ కేడర్’ కార్యక్రమాలు నిర్వహించుకోవా లని సూచించారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జులు తూతూమం త్రంగా పనిచేయవద్దని చంద్రబాబు చురకలు అంటించారు.
‘తూర్పు’లో పాదయాత్ర విజయవంతం
నల్లజర్ల మండలంలో పర్యటించి.. మళ్లీ ఏలూరు జిల్లాలోకి పయనం
నల్లజర్ల/గోపాలపురం, సెప్టెంబరు 2: యువగళం పేరుతో లోకేశ్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైంది. గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన పాదయాత్ర రెండో రోజు శింగరాజుపాలెం మీదుగా ఉంగుటూరు మండలంలోకి వెళ్లింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రకాశరావుపాలెం క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా పాదయాత్రలో మహిళలతో మాట్లాడుతూ, చిన్నారులను ఆశీర్వదిస్తూ లోకేశ్ ముందుకువెళ్లారు. ముందుగా క్యాంప్ వద్ద రాజమహేంద్రవరం నాయకులు శిష్ట్లా లోహిత్ తన కుటుంబ సభ్యులతో లోకేశ్‌ను కలిశారు. శింగరాజుపాలెంలో మహిళలు హరతులుపట్టారు. ఆవపాడు, శింగరాజుపాలెంలలో గజమాలలతో లోకేశ్‌ను సత్కరించారు. ఆయన వెంట పార్టీ నేతలు ముళ్లపూడి బాపిరాజు, గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్, యద్దనపూడి బ్రహ్మరాజు, యలమాటి శ్రీనివాసరావు, పసుమర్తి రతీష్, కొఠారి గాంధీ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా దళితుల సమస్యలు పరిష్కరించాలని శింగరాజుపాలెం గ్రామంలో మహిళలు లోకేశ్‌కు వినతిపత్రం అందించారు గత ప్రభుత్వంలో చేపట్టిన డ్రైనేజీ పనులు గాలికి వదిలేశారని, ఇళ్లస్థలాలు, సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా గతంలో ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ టీడీపీ అధికారంలో రాగానే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి 24 గంటలు నీటి సరఫరా అందిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి గతంలో మాదిరి సబ్సిడీపై స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. ఎస్సీల కోసం ఖర్చు చేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల ముం దు పాదయాత్ర చేస్తూ బుగ్గలు నిమిరి, ముద్దులు పెడుతూ ఎస్సీలపై కపట ప్రేమ చూపిన జగన్.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తన నిజస్వరూపం బయట పడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దళితుల కోసం 27 సంక్షేమ పఽథకాలను అమలుచేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ రద్దు చేశారన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన దళితులపై పోలీసులను అడ్డుపెట్టుకుని దమనకాండ సాగించిన దరిద్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, అది జగన్‌రెడ్డి మాత్రమే అన్నారు. సింగరాజుపాలెంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం, స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.