Bopparaju: ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి: బొప్పరాజు

ABN , First Publish Date - 2023-04-17T21:31:07+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎఫ్‌ఎంఎస్‌ (CFMS) సంస్థ ద్వారా కాకుండా ట్రెజరీ ద్వారానే జీతాలు చెల్లించాలని ఏపీ ఉద్యోగులు జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

Bopparaju: ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి: బొప్పరాజు

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎఫ్‌ఎంఎస్‌ (CFMS) సంస్థ ద్వారా కాకుండా ట్రెజరీ ద్వారానే జీతాలు చెల్లించాలని ఏపీ ఉద్యోగులు జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల జీతాల బిల్లుల పరిశీలన ట్రెజరీ చేస్తోందని, జీతాల చెల్లింపులు మాత్రం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చేస్తున్నారని, సీఎఫ్‌ఎంఎస్‌ వచ్చాక జీతాలు ఎప్పుడు అందుతాయో అంతుపట్టడం లేదన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ ఒక ప్రైవేటు సంస్థ అని, ఆ సంస్థకు వెళ్లి అడిగితే సమాధాన చెప్పే దిక్కు కూడా లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రెజరీ ద్వారానే ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2023-04-17T21:31:07+05:30 IST